विवेचन सारांश
శ్రీమద్భగవద్గీత - భూమిక
ప్రార్థన, దీప ప్రజ్వలన తో ప్రారంభమైన కార్యక్రమములో శ్రీమద్భగవద్గీతలోని మొదటి అధ్యాయం వివేచన మొదటి భాగం గీతాప్రవీణ సుశ్రీ రూపల్ జీ శుక్లా గారి ద్వారా చెప్పబడినది. భగవంతునికి మన అందరిపై మంగళమయ కృప ఉండటం వల్ల, మన జీవితాన్ని సార్ధకం చేసుకోవడానికి ఈ శుభప్రదమైన మార్గములో గీతను తెలుసుకోవడానికి ముందుకు వెళుతున్నాము. గీతను చదువుతున్నప్పుడు ఎప్పుడైనా గీతా సిద్ధాంతాలు మన జీవితములోనికి రావాలని అనిపిస్తుంటుంది. భగవంతుని మంగళమయ కృపవల్లనే మన మనసులో ఇలాంటి భావనలు కలుగుతాయి. ఏ విధంగా మనని భగవంతుడు కరుణించాడో, మన పుణ్య కర్మ ఫలము వలననో, ఋషి, మహాత్ముల కరుణా దృష్టి వలననో మనందరం గీతను చదవడానికి, తెలుసుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి ఈ గీతా మార్గములో ముందుకు వెళుతున్నాము. చాలా అధ్యాయాలు తెలుసుకున్న తరువాత మనం మొదటి అధ్యాయానికి వచ్చాము. ఎందుకిలా? మనము శాస్త్రముల అధ్యయనము చేసినప్పుడు దాని అధ్యాయ క్రమములో కాకుండా తాత్పర్యము ముఖ్యముగా తీసుకుని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. కేవలం గీతా అధ్యయనం లోనే కాకుండా, వేద, వేదాంగ, వేదాంతముల వంటి శాస్త్ర అధ్యయనం కూడా అధ్యాయాల వరుస క్రమంలో కాకుండా మనం ఎలా అర్థం చేసుకోగలం మరియు మన యోగ్యత ఏ విధముగా ఉన్నది అన్నదాన్ని బట్టి, తాత్పర్య ప్రామాణికంగా నిర్ధారించబడిన క్రమంలో నేర్చుకోవడం జరుగుతుంది. లెర్న్ గీతా ద్వారా మనం భగవద్గీతను నేర్చుకోవడం మొదలు పెట్టినప్పుడు పన్నెండవ అధ్యాయం నుంచి ప్రారంభించాము. పన్నెండవ అధ్యాయంలో భక్తి మనకందరికీ సరళమైనది. పూజలు, అర్చనల ద్వారా మనకు చిన్నప్పటినుంచి భగవంతునిపై భక్తి గురించి ఎక్కువగా తెలుసు. జ్ఞాన యోగం గురించి గీత చదవడం మొదలు పెట్టిన తర్వాత ఎంతోకొంత విని ఉంటాము, తెలుసుకుని ఉంటాము అలాగే జ్ఞానుల గురించి కూడా కొంతవరకు విని ఉంటాము. భక్తి మాత్రం మనకి ముందు నుంచి బాగా పరిచయం ఉన్నది. అందువల్లనే మనం పన్నెండవ అధ్యాయం భక్తి యోగంతో మొదలు పెడతాము. పన్నెండవ, పదిహేనవ అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము, పదహారవ అధ్యాయములో దైవ, అసుర గుణాల గురించి తెలుసుకున్నాము. వీటి ద్వారా నెమ్మదిగా మనలో పాత్రత నిర్మాణమౌతుంది. అందువలన మనం అందులోని సిద్ధాంతాలను తెలుసుకోవడానికి, నిగూఢమైన రహస్యాలను గ్రహించడానికి ఎంతోకొంత ప్రయాస చేయగలుగుతాము. అధ్యాయము యొక్క సంఖ్యా క్రమంలో మొదలు పెడితే, మొదటి అధ్యాయములో అర్జునిని యొక్క విషాదము, రెండవ అధ్యాయములో స్థితప్రజ్ఞత లక్షణాల గురించి భగవంతుని వివరణ మన స్థాయి, సహనానికి మించి ఉండటం వలన ముందుకు సాగడం కష్టం. అర్జునిని రోదన మరియు తరువాత భగవంతుని సంక్లిష్టమైన బోధనతో అర్థం కాక మనము ఈ మార్గాన్ని వదిలి వేస్తాము. అందుకే గీతా పరివార్ ద్వారా అభివృద్ధి చేయబడ్డ పద్ధతి, మన శాస్త్రముల అధ్యాయమునకు అవలంబించ బడే పద్ధతికి ఆధారము దానిలో ఉన్న తాత్పర్యము. అందుకే మనం పన్నెండవ అధ్యాయం నుంచి భగవద్గీతను నేర్చుకోవడం ప్రారంభించాము. అలా ప్రారంభించి మొదటి రెండు స్థాయిలలో ఆరు అధ్యాయాలు నేర్చుకుని ఇప్పుడు మూడవ స్థాయిలో మనము మొదటి అధ్యాయం నేర్చుకొనుటకు ఉపక్రమించితిమి. మొత్తం పద్దెనిమిది అధ్యాయాలూ చూసుకుంటే మొదటి అధ్యాయంలో ఆలోచించడానికి చాలా తక్కువ ఉంటుంది. కాని మొదటి అధ్యాయములో మొత్తం భగవద్గీతకు భూమిక ఉంటుంది. భగవద్గీత తెలుసుకునే ముందు దాని భూమిక తెలుసుకోవడం అవసరం. భూమిక తెలుసుకునేముందు మహాభారతం గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఈరోజు మనం భూమిక గురించి తెలుసుకుందాం. దీని ద్వారా అసలు భగవద్గీత ఎలా ఉద్భవించింది? మహాభారతం అంటే ఏమిటి? దానిని ఎలా రచించారు? అనే విషయాలు తెలుసుకోవడం ద్వారా మొదటి అధ్యాయం యొక్క సారాంశము తెలుసుకొనుటలో అడుగు ముందుకు వేయగలుగుతాము. పదహారవ అధ్యాయములో మనము “కర్మకర్తు మిహార్హసి” అని విన్నాము. మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే విషయాలు శాస్త్రములలో చెప్పబడినవి. మరి అసలు శాస్త్రములు అంటే ఏమిటి అనే ప్రశ్న ఉద్భవించ వచ్చును. వేటిని శాస్త్రములు అని అనవచ్చును? భగవద్గీతను మనము శాస్త్రము అని అంటున్నాము. భగవద్గీత కాకుండా ఇంకా వేరే శాస్త్రములు ఏమిటి? మనము సనాతన సంస్కృతి మరియు సనాతన ధర్మము గురించి మాట్లాడినప్పుడు వాటిలో శాస్త్రములంటే ఏమిటి? శాస్త్రముల పరిభాష ఏమిటి అంటే “అనుశాసయతి ఇతి శాస్త్రం, అనుశాసనం కరోతి ఇతి శాస్త్రం”. అంటే మనం ఏమి చేయాలి, చేయకూడదో చెప్పేదే శాస్త్రం. మనం ఏమి చేయాలో ఏమి చేయకూడదో శాసించేది శాస్త్రం. ప్రాతః కాలం నుంచి , రాత్రికాల పర్యంతం వరకు నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, ప్రాయశ్చిత్త కర్మ, కార్య కర్మ వీటన్నిటి గురించి మనకు జ్ఞానమొసగేవి శాస్త్రములు. ఇప్పుడు మనము ఏ ఏ శాస్త్రములు తెలుసుకోవాలి? మనం భారతీయ విజ్ఞాన పరంపరను అన్వేషిస్తే, అనేక విషయములు గోచరించును. చతుర్దశ విద్యా స్థానములలో మొదట నాలుగు వేదములు, తరువాత ఆరు వేదాంగములు, ఇవి కాకుండా ఇతిహాసములు, పురాణములు ఉంటాయి. వీటిలో ముఖ్యమైన నాలుగింటిగా విభాగిస్తే అవి శృతి, స్మృతి, ఇతిహాసములు, పురాణములు. శృతి అంటే శ్రవణం చేయడం, వినడం. వేదముల జ్ఞానము శ్రవణము ద్వారా గురు శిష్య పరంపరలో అనాదిగా వస్తున్నది. మొదట్లో బహుశా లిపి కూడా లేదు. మరి ఈ వేదముల జ్ఞానము ఎలా మనగలిగింది? మన యొక్క ఈ శృతి పరంపర వలన. గురువులు తమ శిష్యులకు ఉపదేశం చేసేవారు. గురువు ఒక్కసారి చెప్పినది విని శిష్యులు పారాయణం చేస్తూ, చేస్తూ ఉండేవారు. తరువాత ఈ శిష్యులే గురువులై తమ శిష్యులకు బోధించేవారు. ఈ పరంపరలో వేల, లక్షల సంవత్సరములు మనగలిగిన ఈ శాస్త్రములు మనవరకూ వచ్చినవి. శాస్త్రములను మన వరకు తీసుకురావడానికి మన ఋషీంద్రులు ఎంత పరిశ్రమించారో మనకు అవగతమవుతుంది. ఆ రోజులలో శిష్యులు తమ ప్రజ్ఞతో గురువు ఒక్కసారి చెప్పినది విని నేర్చుకోగలిగేవారు మరియు ముందు తరాలకు నేర్పించేవారు. దీనినే శృతి పరంపర అంటారు. నాలుగు వేదములు - ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మరియు అధర్వణవేదము, ఇవి శృతి గా పిలువబడతాయి. స్ముతి అంటే సామాన్య ప్రజలకు వీటి జ్ఞానం ఉండాలి. మనుస్మృతి, ధర్మశాస్త్రములు, భగవద్గీత స్మృతి గానే చెప్పబడతాయి. రామాయణము, మహాభారతము అన్నింటికన్నా ముఖ్యమైన ఇతిహాసములు. భాగవతాదులు పురాణములు. భాగవతము, భగవద్గీత వేరు వేరని మనకు తెలుసు. భాగవతం లాంటివి 18 ముఖ్య పురాణములు. మత్స్యపురాణము, విష్ణు పురాణము, శివ పురాణము లాంటివి చాలా పురాణములు ఉంటాయి. శ్రుతి, స్మృతి, ఇతిహాసములు, పురాణములు ఇవి నాలుగు రకములైన శాస్త్రములు. భగవద్గీత ముఖ్య రూపములో స్మృతి అయినప్పటికీ ఈ నాలుగు రకములైన శాస్త్రముగా చెప్పబడుతుంది. ఎందుకలా? మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాము, వేదముల సారము ఉపనిషత్తులని, ఉపనిషత్తుల సారము శ్రీమద్భగవద్గీతయని. శ్రీమద్భగవద్గీతలో వేదముల సారము ఉండటం వల్ల శృతి అని అంటారు. గీత స్మృతిలో ఎలాగూ ఉంది. గీత మహాభారతంలో భాగం ఆవటం వల్ల దీనిని ఇతిహాసము అంటారు. పురాణాలన్నిటినీ మహర్షి వేదవ్యాసులవారు రచించారు. భగవద్గీత కూడా వారిచే రచింపబడినదే. అందువలన దీన్ని పురాణము అని కూడా అంటారు. అందువలన భగవద్గీతను తెలుసుకుంటే అన్ని శాస్త్రముల సారాంశము మనకు లభించినట్లే. మహాభారతాన్ని, మహా భారతం అని ఎందుకు అంటారు అన్న విషయం తెలుసుకోవాలి. మహాభారతం మూల నామం జయ సంహిత. మరైతే మహాభారతం అన్న పేరు ఎలా వచ్చింది? ఒకప్పుడు ఋషుల మధ్య ఒక చర్చ జరిగింది, వేదములు భారమైనవా లేక మహాభారతం భారమైనదా అని. భరత వంశానికి సంబంధించినది కాబట్టి భారతం అనే పేరు వచ్చింది. వేదములు భారమైనవి కాబట్టి వాటికి భారత అనే పేరు, జయ సంహిత ఇంకా బరువైనది కాబట్టి దానికి మహాభారతం అని పేరు పెట్టారు. వీటి మధ్య ఉచ్చ నీచముల ఆలోచనలు రాకుండా మహాభారతాన్ని పంచమ వేదమని అన్నారు. “భారత పంచమ వేద ఆరతి సుర నర మునిగా ...” అనే వాఖ్యం మహాభారత ఆరతిలో ఉంటుంది. మహాభారతం అన్నిటికన్నా పెద్ద మహా కావ్యమని విశ్వవ్యాప్తంగా ఒక అంగీకారం ఉన్నది. మహాభారతం రచించినప్పుడు మొత్తం అరవై లక్షల శ్లోకములు ఉండేవి. వీటిని విభజించి 30 లక్షల శ్లోకములు దేవతలకు ఇవ్వబడ్డాయి. వీటిని నారద ముని స్వయంగా పాడుతుంటారు. పదిహేను లక్షల శ్లోకములు పితృ లోకములకు ఇవ్వబడినవి. అక్కడ అశిత, దేవఋషులు వీటిని పాడుతుంటారు. పదునాలుగు లక్షల శ్లోకములు యక్షులకు ఇవ్వబడ్డాయి. అక్కడ సుకదేవ ముని యక్ష రూపములో స్వయంగా వీటిని పాడుతుంటారు. ఒక లక్ష శ్లోకములు ఈ మృత్యు లోకములో మన మనుషులకు లభించినవి. ఇక్కడ వీటిని వైశంపాయన ఋషి జనమేజయునికి పాడి వినిపించారు. మొత్తం కథ చూసుకుంటే, మహాభారతం వైశంపాయన మరియు జనమేజయుల సంవాదము, మనకు లక్ష శ్లోకముల రూపములో లభించినది. విచిత్రమేమిటంటే భవిష్యత్తులో మహాభారతం వైశంపాయనుని ద్వారా జనమేజయునికి చెప్పబడుతుందని కూడా వ్యాసులవారు రచించారు. ఇది ఎలా సంభవం అంటే, వేద వ్యాసులవారు త్రికాల దృష్టి కలవారు. వారు భూత, వర్తమాన, భవిష్య కాలములలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది యధావిధిగా చూడగల సామర్థ్యము ఉన్నవారు. అందువల్లనే జరగబోయేది కూడా ముందే రాయగలిగారు. వైశంపాయనులవారు వేదవ్యాసుల వారి శిష్యులు. వేదవ్యాసులవారు మహాభారతాన్ని వైశంపాయనుల వారికి చెప్పగా, వైశంపాయనులవారు దానిని జనమేజయునుకి చెప్పారు. జనమేజయుడు ఎవరు? మనం ఒక క్రమంలో చూసుకుంటే, మహాభారతంలో కురు వంశానికి చెందిన శాంతనుడు మొట్టమొదటి రాజు. కురు వంశము అంటే ఏమిటి? కురు అనే ఒక రాజు ఉండేవారు. ఆయన తపస్సు చేసిన ప్రదేశం (క్షేత్రం) కురుక్షేత్రంగా పిలవబడింది. ఈ వంశంలో అనేకమంది రాజులున్నారు. కురు యొక్క వంశములో భరతుడు, భరతుని తరువాత శాంతనుడు ఉన్నారు. మహాభారతంలో శాంతనుడు మొట్టమొదటి రాజు (కురు వంశ వర్ణన https://drive.google.com/file/d/1qndEEQOErPR1snyD0myl8cGLA92Nugep/view?usp=drive_link లో ఇవ్వబడినది). శాంతనుని పుత్రులు భీష్మ పితామహుడు, చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు. విచిత్రవీర్యుని పుత్రులు ధృతరాష్ట్రుడు మరియు పాండురాజు. ధృతరాష్ట్రుని పుత్రులు కౌరవులు, పాండురాజు పుత్రులు పాండవులు. వీరికి కూడా పుత్రులున్నారు. మనం అర్జునుని తీసుకుంటే అతని పుత్రుడు అభిమన్యుడు. అభిమన్యుని పుత్రుడు పరీక్షిత్. పరీక్షిత్ పుత్రుడు జనమేజయుడు. జనమేజయుడు తన పూర్వజుల పరాక్రమం, తేజస్సు, శక్తిశాలత, మహా యుద్ధం గురించి కొన్ని కొన్ని గాధలు విన్నానని, పూర్తిగా వివరంగా చెప్పవలసిందిగా వైశంపాయనుని కోరతాడు. నా పూర్వజులు ఎవరు? అసలు ఏమి జరిగింది? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా వైశంపాయనుడు శాంతనుని దగ్గర మొదలు పెట్టి మొత్తం మహాభారత ఇతివృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు. మహాభారతాన్ని ఎలా రచించారు? వేద వ్యాసులవారు పద్దెనిమిది పురాణములను రచించిన తరువాత కూడా ఆయనకు సంతృప్తి లభించలేదు. ఇంకా ఎంతో కొంత మిగిలి ఉన్నదనే భావన కలిగినది. ఈ సందేహ నివృత్తికై వ్యాసులవారు బ్రహ్మ దగ్గరికి వెళ్లారు. విశ్వ కల్యాణమునకై ఇంకా రచించవలసినది మిగిలి ఉన్నది అనిపిస్తోంది, ఇప్పుడు నేను ఏమి చేయాలి? అని ప్రశ్నించారు. ప్రాచీన కాలంలో జ్ఞాన పురుషులకు సందేహము వచ్చినప్పుడు బ్రహ్మ దగ్గరకు వెళ్లి అడగటం అనేది ఒక పరంపరగా ఉండేది. బ్రహ్మదేవుడు మహాభారతాన్ని రచించ వలసినదిగా వేద వ్యాసుని కి చెప్పెను. అది విని వ్యాసుడు ఇంతటి బృహత్తరమైన గ్రంథం రచించినప్పుడు అనేక ఆలోచనలు తనలో ఉద్భవించి త్వరితగతిన మరుగున పడిపోతాయి అని, అంత వేగంగా రాయడం కష్టమని, అందువలన తనకు ఒక లేఖకుడిని ఇవ్వవలసినదిగా బ్రహ్మదేవుని కోరతాడు. బ్రహ్మదేవుడు ఈ విషయంలో విఘ్నేశ్వరునికి నివేదించుకోవలసినదిగా సలహా ఇస్తాడు. బహుశా ఆయన మీకు మహాభారతం వ్రాయడంలో సహకరించగలరు. అప్పుడు వ్యాసుడు విఘ్నేశ్వరుని దగ్గరకు వెళ్ళి బ్రహ్మ ఆదేశంతో తాను మహాభారతం రచించ బోతున్నానని అందులకు లేఖకునిగా తమ సహకారం ఇవ్వవలసినదిగా కోరుతాడు. విఘ్నేశ్వరుడు బ్రహ్మ ఆజ్ఞ అతిక్రమించ లేము, అలాగే మీయొక్క నివేదన కూడా శిరోధార్యము, కాని నాకు ఒక సమస్య ఉన్నది. నేను శీఘ్రగతిన లిఖించగలను. మీరు శ్లోకములను రచించినప్పుడు ఎక్కడైతే విరామము వస్తుందో అక్కడ నేను గ్రంథాన్ని లిఖించడం ఆపి వేస్తాను అని చెబుతాడు. ఈ షరతుకు వేద వ్యాసుడు అంగీకరిస్తూ, తనకు కూడా ఒక షరతు ఉందని అది తను చెప్పిన శ్లోకం పూర్తిగా అర్థం అయ్యే వరకు విఘ్నేశ్వరుడు లిఖించ రాదని చెబుతాడు. ఈ షరతుకు విఘ్నేశ్వరుడు అంగీకరిస్తాడు. బద్రీనాథ్ ధామం దగ్గర సరస్వతీ నది ఒడ్డున ఒక గుహ ఉంది. ఆ గుహలో ఆసీనులై వేద వ్యాసుడు మహాభారతాన్ని రచించడం ప్రారంభించగా దానిని విఘ్నేశ్వరుడు లిఖించడం ఆరంభించాడు. ఎక్కడైతే వ్యాసులవారికి ఆలోచించుకోవడానికి సమయం అవసరమయ్యేదో అక్కడ ఒక చాలా కఠినమైన శ్లోకాన్ని చెప్పేవారు. షరతు ప్రకారం విఘ్నేశ్వరుడు దానిని అర్థం చేసుకుని వ్రాయాలి. విఘ్నేశ్వరుడు అర్థం చేసుకుని వ్రాసే లోగా వ్యాసుడు ఆలోచించుకుని తరువాతి శ్లోకాన్ని చెప్పేవారు. అందువల్లనే మహాభారతంలోని 60 లక్షల శ్లోకాలలో 88 వేల శ్లోకాలు చాలా కఠినమైనవి. మొత్తం మహాభారతం రచించడానికి మూడు నుంచి మూడున్నర సంవత్సరముల సమయం పట్టింది. విరామం లేకుండా రచించడం మరియు లిఖించడం వల్ల ఈ గ్రంథం మూడు నుంచి మూడున్నర సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేయగలిగారు. మహాభారతం ఒక అక్షయ గ్రంథం కావాలనే ఉద్దేశ్యంతో దాని లేఖనం అక్షయ తృతీయ రోజు ప్రారంభించడమైనది. దీనికి మొదలు జయ సంహిత అనే పేరు ఎందుకు పెట్టారు? వేద వ్యాసుల వారికి బహుశా అనిపించి ఉండవచ్చును, మహాభారతం పూర్తిగా చదివిన వారికి జీవితంలో అన్ని వేళలా విజయం ప్రాప్తిస్తుంది అని. ఈ అరవై లక్షల శ్లోకాలలో సుమారు ఐదువేల పాత్రలున్నాయి. వేదవ్యాసులవారు ఈ గ్రంథాన్ని విశ్వ కళ్యాణం కోసమే రచించారు కాబట్టి ప్రపంచంలోని ప్రతి వ్యక్తి తనని తాను ఈ అయిదు వేల పాత్రలలో ఏదో ఒక దానితో సరి పోల్చుకో గలుగుతారు. ఈ ఐదువేల పాత్రల విశేషం ఏమిటంటే మనలాంటిది ఏదో ఒక పాత్ర ఉంటుంది. మహాభారతం యుద్ధానికీ, గొడవలకీ సంబంధించిన గ్రంథముగా ఒక అపోహ ఈ మధ్యకాలంలో వ్యాపించి వున్నది. మహాభారతాన్ని ఇంట్లో పెట్టుకుంటే గొడవలు అవుతాయని, మంచిది కాదని విష ప్రచారం జరుగుతోంది. నిజానికి స్వామీజీ చెప్పినది ఏమిటంటే మహాభారతం లేకపోతే ఇంట్లో గొడవలు అవుతాయి. మహాభారతంలో అనేక జీవితాంశాలు, ధర్మము గురించి చెప్పబడింది. పురుషులు ఎలా ఉండాలి?, స్త్రీలు ఎలా ఉండాలి?, వివాహ సంబంధాలు ఎలా ఉండాలి?, ఆదర్శ తండ్రి ఎవరు?, ఆదర్శ పుత్రుడు ఎవరు?, ఆదర్శ సోదరి కర్తవ్యం ఏమిటి?, ఆదర్శ స్త్రీ కర్తవ్యం ఏమిటి? మీరు ఆలోచించగలిగిన ఏ విషయమైనా ఆదర్శ రాజు దగ్గరనుంచి ఆదర్శమైన ప్రజల వరకు అన్ని విషయాలు స్పష్టంగా ఇందులో చెప్పబడ్డాయి. అందువల్ల మహాభారతం చదివేవారి ఇంట్లో గొడవలు రావు. చదవకపోయినా ఇంట్లో ఉన్నా మేలు చేస్తుంది. అన్నింటా విజయం చేకూరుస్తుంది. మహాభారతాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు అన్నది ఒక అబద్దపు ప్రచారం మాత్రమే. మన సంస్కృతిని వినాశనం చేయడానికి పన్నిన ఎన్నో కుట్రలలో ఇది ఒకటి. ఇది ప్రజల ఉన్నతికై రచింపబడ్డ గ్రంథము. ఇది చదివితే మనం జ్ఞానులమై, ఉన్నతిని సాధిస్తాం అని కుట్రలు జరుగుతున్నాయి. ఈ శాశ్త్రాలను చదవడం ద్వారా భారత దేశం విశ్వగురు స్థానాన్ని సాధించగలుగుతుంది. ఇది మనను మన శాస్త్రముల నుంచి దూరం చేయడానికి పన్నిన కుట్ర. ఇప్పుడు మనకి కథలు మాత్రమే తెలుసు. మూల శాస్త్రం చదవలేము. మనం సంస్కృతంలో చదవడం ఎప్పుడో వదిలిపెట్టేసాము, ఎందుకంటే ఇప్పుడు మనకి సంస్కృతంలో చదవడం రాదు. ఇది మనని సంస్కృతం నుంచి, రామాయణం, మహాభారతం, మరెన్నో మూల గ్రంథాల నుంచి దూరం చేయడానికి జరిగిన షడ్యంత్రము. మనం మన సంస్కృతి యొక్క మూల తత్వాల్ని తెలుసుకుని, వాటిపై గౌరవాన్ని పెంపొందించుకున్నపుడు, వక్రమార్గంలో పయనించము. మహాభారత గ్రంథము ఇంట్లో పెట్టుకోకూడదు అనేది ఒక కుఠిల నీతితో ప్రచారం చేసిన భ్రాంతి మాత్రమే. ఇంట్లో లేకపోతే మనం దానిని చదవము. జీవనం సామాన్యంగానే ముందుకు సాగుతూ ఉంటుంది. ఒక మహత్తరమైన గ్రంథం మన దగ్గర ఉన్నప్పటికీ దానిలో ఉన్న జ్ఞానానికి మన వంచితులై పోతాము. రామాయణ మహాభారతాలు మన ఇంట్లో తప్పనిసరిగా ఉండవలసిన శాస్త్రములు. మనకు లక్ష శ్లోకములు ఇచ్చిన మహాభారతం ఒక మహాకావ్యము. మహాభారతం తర్వాత రెండవది రామాయణం. ఇందులో 24 వేల శ్లోకాలు ఉన్నాయి. ప్రపంచంలోని ఏ ఇతర ధర్మ గ్రంథము రామాయణ మహాభారతాలకు సమీపంలో కూడా ఉండవు. మన దగ్గర ఉన్నటువంటి ఇంతటి విశాలమైన గ్రంథములు మరి ఎవరి దగ్గరా లేవు. మన దగ్గరున్న బాండాగారాన్ని వదిలిపెట్టి, ఒకటి, రెండు స్వర్ణ ముద్రలకై వెతుకుతూ ఉంటాము. వాటితో పనేముంది. మనం మన బాండాగారాన్ని తెరచి మన శాస్త్రాలను అధ్యయనం చేద్దాం, మన కృష్ణుడు ఏమి చెబుతున్నాడో తెలుసుకుందాం. సంహిత అంటే అన్ని మూల శ్లోకాలు ఒక చోట చేర్చడం. జయ అనగా 18 అని కూడా అర్థం వస్తుంది. ఇది 18 పర్వములుగా విభజించబడినది. మహాభారతం చాలా పెద్ద కావ్యం. ఇందులో భీష్మపర్వం ఒకటి. భీష్మ పర్వంలో 25 నుంచి 42 వరకు ఉన్న అధ్యాయాలను భగవద్గీత అంటారు. ఇది స్వతంత్ర గ్రంథం కాదు. మహాభారతంలోని భీష్మ పర్వములో ఒక భాగం మాత్రమే. చర్చించిన విషయాలు ఆధారంగా భగవద్గీత లోని అధ్యాయములు విభజింపబడ్డాయి.
మత్స్య కన్య అయిన సత్యవతి ఒకరోజు పరాశర మునిని తన పడవలో నది దాటిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ ప్రదేశాన్ని దట్టమైన పొగమంచు కప్పి వేస్తుంది. పరాశర ముని కాలగణనం చేసి ఇలాంటి సంయోగము ఎప్పుడో కాని రాదని భావించి, సత్యవతితో కన్యా నీవెవరో నాకు తెలియదు. కాని ఇప్పుడు నేను నీతో సమాగమమై ఒక పుత్రునికి జన్మనిస్తే ఈ కాల గణనం ప్రకారం అతడు బ్రహ్మాండం మొత్తానికి కళ్యాణకారి, అందరినీ మించిన విద్యావంతుడు అవుతాడు అంటాడు. అప్పుడు సత్యవతి మునీశ్వరులైన మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు, తరువాత నా పరిస్థితి ఏమిటి?, ఇలాంటి విషయాలు నా తండ్రితో మాట్లాడుకోండి అని చెబుతుంది. అతను అంత సమయం లేదని ఇది కొన్ని క్షణాల కాలం మాత్రమేనని, దాటితే అంతటి విద్యావంతుని జననం సాధ్యం కాదని చెబుతాడు. మునీశ్వరుల మాట దాటలేని సత్యవతి, దీనివల్ల తనకి ఏమి ప్రయోజనం అని అంటుంది. నీకేం కావాలో కోరుకో అంటాడు పరాశరుడు. సత్యవతి తన శరీరం నుంచి వచ్చే దుర్గంధము వలన తననెవ్వరు వివాహమాడటానికి రావడంలేదని, ఈ దుర్గంధము లేకుండా చేయమని కోరుతుంది. పరాశరుడు ఆమె శరీరం నుంచి వచ్చే దుర్గంధం తొలగిపోవడమే కాకుండా 100 యోజనముల దూరము వరకు ఆమె సుగంధం వ్యాపిస్తుందని వరమిస్తాడు. అప్పుడు వారి సమాగమంతో ఉత్పత్తి అయిన పుత్రుడే కృష్ణ (నల్లగా ఉండటం వలన) ద్వైపాయన వ్యాసుడు. అతను వేదములను రచించడము వలన వేద వ్యాసుడు అయ్యాడు.
అప్పటి నుంచి సత్యవతి శరీరంనుంచి సుగంధము దూర, దూరముల వరకు వ్యాపించడం మొదలైంది. ఒకరోజు వ్యాహాళికి వచ్చిన శాంతనుడు ఈ సుగంధమునకు ఆకర్షితుడై ఇది సత్యవతి నుంచి వస్తోందని తెలుసుకుంటాడు. సత్యవతిని సమీపించి ప్రణయ నివేదన చేయగా, తన తండ్రితో మాట్లాడమని చెబుతుంది. ఈ ధరిత్రికే మహారాజైన శాంతనుడు, సత్యవతి తండ్రి అయిన ద్రాక్ష రాజు దగ్గరకు వెళ్లి తన వివాహ ప్రస్తావనను తెలియచేస్తాడు. అత్యాశాపరుడు, జిత్తులమారి అయిన సత్యవతి తండ్రి మీ ఆజ్ఞను నేను స్వీకరిస్తాను కాని మీకు దేవవ్రతుడు అనే కొడుకు ఉన్నాడు. అతడు రాజైతే నా కూతురి ద్వారా కలిగిన సంతానం పరిస్థితి ఏమిటి? అందువలన నా కూతురి వలన కలిగిన పుత్రులకే రాజ్యాధికారం ఇస్తానంటేనే మీ వివాహ ప్రస్తావనకు నేను అంగీకరిస్తాను అంటాడు. దేవవ్రతునిపై ఉన్న ప్రేమతో శాంతనునిలో కలిగిన ఆగ్రహానికి సత్యవతి తండ్రి వణికిపోతాడు. ఆగ్రహంతో శాంతనుడు అక్కడి నుంచి వెళ్లి పోయినప్పటికీ చాలా ఉదాసీనంగా ఉంటాడు. తండ్రి ఉదాసీనత ను గమనించిన దేవవ్రతుడు దూతల ద్వారా సత్యవతి విషయం తెలుసుకుని ఆమె తండ్రి ద్రాక్ష రాజు దగ్గరకు వెళతాడు. భయకంపితుడైన ద్రాక్ష రాజును చంపనని అభయమిచ్చి అతడు పెట్టిన షరతు గురించి తెలుసుకుని, తన తండ్రికి ఆనందాన్ని కలిగించే ఏ విషయాన్ని అయినా సరే తాను సంతోషంగా స్వీకరిస్తారని అందువల్ల తాను రాజ్యాధికారం త్యజిస్తానని చెబుతాడు. అప్పుడు ద్రాక్ష రాజు మీ వరకూ సరే కానీ తరువాత మీ పుత్రులు, మనుమలు రాజ్యాధికారం కోసం పోటీ పడితే ఎలా అని అడుగుతాడు. దానికి సమాధానంగా దేవవ్రతుడు తాను ఆజన్మ కాలాంతము వరకు బ్రహ్మచర్యము చేపడతానని భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు. కాబట్టే అతనిని భీష్ముడంటారు. తదుపరి సత్యవతికి శాంతనునితో వివాహం జరుగుతుంది. వీరికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు పుత్రులు జన్మిస్తారు. వీరిద్దరూ కూడా అంత బలశాలులు కాదు. చిత్రాంగదుడుని భీష్ముడు రాజుగా చేస్తాడు. కొన్ని కారణాల వల్ల చిత్రాంగదుడు మరణిస్తాడు. విచిత్రవీర్యుడు రాజవుతాడు. అతని వివాహము కొరకై ఒక స్వయంవరంలో భీష్ముడు రాజులందరినీ ఓడించి అంబ, అంబిక, అంబాలిక అనే ముగ్గురు రాకుమార్తెలను బలవంతముగా తీసుకువస్తాడు. మార్గమధ్యములో అంబ తను శాళ్వ రాజును ప్రేమించానని, మనస్ఫూర్తిగా అతనిని భర్తగా భావిస్తున్నానని చెప్పడంతో భీష్ముడు అంబను విడిచి పెట్టి మిగతా ఇద్దరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. వెనక్కి వెళ్లిన అంబతో శాళ్వ రాజు తాను భీష్మునితో యుద్ధంలో ఓడిపోయానని అందువలన ఆమెను స్వీకరించ లేనని చెబుతాడు. రెండు పక్కలా తిరస్కారానికి గురియై, కోపోద్రిక్తురాలైన అంబ, నీ మృత్యువుకు నేనే కారణం అవుతానని భీష్ముడిని శపించి అక్కడికక్కడే ఆత్మదహనం చేసుకుంటుంది. ఇదే అంబ తరువాతి జన్మలో శిఖండి రూపములో భీష్ముని మరణానికి కారణమౌతుంది. పూర్వజన్మలో ఆమె స్త్రీ అగుట చేత భీష్ముడు ఆమెపై అస్త్రాన్ని సంధించడు. అంబిక, అంబాలికల వివాహం విచిత్రవీర్యునితో జరుగుతుంది. విచిత్రవీర్యుడు కూడా నిర్బలుడు అయిన కారణంగా సంతానము కలుగదు. సత్యవతి తన జ్యేష్ఠ పుత్రుడైన వ్యాసుని పిలిచి తన కోడల్లిద్దరికీ గర్భధారణ చేయవలసినదిగా కోరుతుంది. వ్యాసుడు తన తపోబలంతో అంబిక, అంబాలికలకు గర్భధారణ చేస్తాడు. కాని వ్యాసుడు అంబిక ముందుకు వెళ్ళినప్పుడు అతని నల్లటి, సంవత్సరాలుగా అడవులలో తపస్సు చేయడం వలన వచ్చిన భయంకర రూపాన్ని చూసి కళ్లు మూసుకుంటుంది. అందువలన ఆమెకు కలిగిన పుత్రుడు ధృతరాష్ట్రుడు జన్మతః అంధుడు. వ్యాసుడు అంబాలిక ముందుకి వెళ్ళినప్పుడు అతని రూపాన్ని చూసి ఆమె ముఖం పాలిపోయింది. అందువల్లనే ఆమె పుత్రుడు పాండు రోగంతో పుట్టాడు. అందువలన పేరు పాండు గా ప్రసిద్ధమైనది. ధృతరాష్ట్రునికి గాంధారితోనూ, పాండురాజుకి కుంతి, మాద్రిల తోనూ వివాహము జరిగినది. పాండురాజు చిన్నప్పటినుంచే రోగగ్రస్తుడవడంవల్ల అతనికీ సంతానము కలుగలేదు. కుంతికి దూర్వాస ముని ఇచ్చిన ఒక వరదానము ఉన్నది. దీని సహాయంతో ఏ దేవతల్ని ఆవాహనం చేస్తే ఆ దేవతల వల్ల పుత్రులు కలుగుతారు. కర్ణుని చరిత్ర మనకందరకు తెలిసినదే. వివాహానికి ముందే సూర్యుని ఆవాహనం చేయడం ద్వారా కర్ణుడు జన్మిస్తాడు. ఆమె అతనిని నదిలో విడిచి పెడుతుంది. ఆ తరువాత ఆ బాలుడు సూతుని ఇంట్లో పెరగడం వల్ల సూత పుత్రునిగా పిలవబడ్డాడు. కుంతి యమధర్మరాజు కి ఉపాసన చేయడం ద్వారా కలిగిన పుత్రుడు యుధిష్ఠిరుడు (ధర్మరాజు), వాయుదేవునికి ఉపాసన చేయడం ద్వారా కలిగిన పుత్రుడు భీముడు మరియు ఇంద్రునికి ఉపాసన చేయడం ద్వారా కలిగిన పుత్రుడు అర్జునుడు. మాద్రి అశ్వినీ దేవతలకు ఉపాసన చేయడం ద్వారా కలిగిన పుత్రులు నకుల, సహదేవులు. ఈ విధముగా పంచ పాండవులు జన్మిస్తారు. ధృతరాష్ట్రుడు- గాంధారిలకు పిండముల ద్వారా దుర్యోధన దుశ్యాసనాది నూరుగురు పుత్రులు, దుశ్చల అనే ఒక పుత్రిక జన్మిస్తారు. సుభద్ర అర్జునులకు అభిమన్యుడు అనే పుత్రుడు, అభిమన్యునికి కుమారుడిగా పరీక్షిత్, పరీక్షిత్ కి కుమారుడిగా జనమేజయుడు పుడతారు. పాండవులకు ద్రౌపది కాకుండా వారి వారి భార్యలు, పిల్లలున్నారు. అలాగే కౌరవులకు కూడా భార్యలు, పిల్లలున్నారు. కౌరవులు మొత్తం మహాభారత యుద్ధంలో మరణించారు.

1.1
ధృతరాష్ట్ర ఉవాచ
ధర్మక్షేత్రే కురుక్షేత్రే, సమవేతా యుయుత్సవః ৷
మామకాః(ఫ్) పాణ్డవాశ్చైవ, కిమకుర్వత సఞ్జయ॥1.1॥
ధృతరాష్ట్రుడు పలికెను - ఓ సంజయా! యుద్ధసన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులును, పాండు పుత్రులును ఏమి చేసిరి?
మనం ఆలోచిస్తే మహాభారత యుద్ధానికి కారణం దుర్యోధనుడు కాదు. స్వామీజీ ఏమంటారంటే ధృతరాష్ట్రుడు ఎంతో దుష్టుడు, నికృష్టుడు, జిత్తులమారి అయ్యుంటాడు. ధృతరాష్ట్రుడు తన కర్తవ్య పాలన చేసి ఉంటే మహాభారత యుద్ధం ఎప్పటికీ జరిగేది కాదు. ఒక తండ్రి తన పుత్రుని శాసించి, సరియైన మార్గములో ఉంచితే ఏ పుత్రుడూ కూడా ధైర్యంగా అలాంటి పనులు చేయలేడు. ధృతరాష్ట్రుడు ఎప్పుడూ దుర్యోధనుని నియంత్రించలేదు. చిన్నతనంలో భీమునిపై విషప్రయోగం తరువాత అలాంటివి ఎన్నో చేసినప్పటికీ దృతరాష్ట్రుడు తెలిసి ఉండి కూడా దుర్యోధనుని ఎప్పుడు ఆపలేదు. ధృతరాష్ట్రుని ఈ తప్పు వలన మహాభారత యుద్ధం జరిగింది. మొదటి శ్లోకంలో అతని భేద భావం కనిపిస్తుంది. “మామకాః(ఫ్) పాండవాశ్చైవ” అంటాడు దృతరాష్ట్రుడు. అంటే నా వారు మరియు పాండు యొక్క పుత్రులు ఆ యుద్ధ భూమిలో ఏమి చేశారు అని ప్రశ్నిస్తాడు ధృతరాష్ట్రుడు. వారు తన మరియు పాండు పుత్రులు ఎలా అయిపోయారు? మన ధర్మ శాస్త్రముల ప్రకారము తమ్ముడు మరణిస్తే అతని పుత్రులు కూడా అన్న పుత్రులు గానే భావించబడతారు. పాండవులు ధృతరాష్ట్రుని తమ తండ్రిగా భావించారు కాని ధృతరాష్ట్రుడెప్పుడూ పాండవులను తన పుత్రులుగా అనుకోలేదు. కౌరవసభలో ద్యూతమాడినప్పుడు ధృతరాష్ట్రుడు ఎక్కడున్నాడు? పాండవులందరూ మరియు ద్రౌపది ధర్మరాజు ఓడిపోతారు . ఆడవద్దని వారించారు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న కుతంత్రం అందరికీ కనిపిస్తోంది. కాని అక్కడ యుధిష్ఠిరుని ఆడమని ధృతరాష్ట్రుడు ఆజ్ఞాపిస్తాడు. ధర్మరాజు సర్వ నాశనం అయిపోయిన పర్వాలేదు, నా తండ్రి ధృతరాష్ట్రుని ఆజ్ఞను ధిక్కరించిలేనంటాడు. భగవద్గీత లోని మొదటి శ్లోకము ‘ధ’ తో మొదలై చివరి శ్లోకము ‘మ’ తో ముగుస్తుంది. మొత్తం గీత అంతా ధర్మం గురించే చెబుతుంది. సంజయుడు ఒక సూత పుత్రుడు , అయినప్పటికీ తన పూర్వజన్మ సుకృతం వల్ల చిన్నతనం నుంచే శాస్త్ర జ్ఞాని, అన్ని విషయాలు అర్థం చేసుకోగలుగుతాడు. శాస్త్రములను నేర్చుకోవాలనే ఆకాంక్షతో అతడు వేదవ్యాసుని దగ్గరకు వెళతాడు. వ్యాసుడు అతనికి నేను కేవలం బ్రాహ్మణులకు మాత్రమే శాస్త్రములను నేర్పిస్తానని చెప్పడంతో, సంజయుడు తనను పరీక్షింపవలసినదిగా కోరతాడు. పరీక్షణ తరువాత వ్యాసుడు ఇతడు మహాజ్ఞాని అని నిశ్చయించుకొని అతనికి బ్రాహ్మణత్వం ఇస్తాడు. కర్మలను అనుసరించి వర్ణ పరివర్తన ప్రాచీన కాలంలో చేసేవారు. కర్ణుడు సూత పుత్రుడు అయినప్పటికీ అతడిని క్షత్రియుడిగా వర్ణ పరివర్తన చేసారు. కౌశిక ఋషి క్షత్రియుడు నుంచి బ్రాహ్మణత్వాన్ని పొందారు, తరువాత ఋషి అయ్యారు, ఋషి నుంచి మహాఋషి అయ్యారు, మహాఋషి నుంచి బ్రహ్మర్షి అయ్యారు. విశ్వామిత్రుడు క్షత్రియుడు నుంచి బ్రహ్మర్షి అయ్యారు. వారి కర్మల ద్వారా వర్ణ పరివర్తన గావించబడినది. వేదవ్యాసుడు సంజయున్ని ధృతరాష్ట్రుని దగ్గర మంత్రిగా ఉండమని చెబుతాడు. ఎల్లప్పుడూ ఆయన దగ్గరే ఉంటూ ఏది మంచో చెబుతూ ఉండమంటాడు. వేదవ్యాసుని ఆజ్ఞ అవటంవల్ల ధృతరాష్ట్రుడు కూడా సంజయుని స్వీకరించాడు. అంబిక, అంబాలికలను వేదవ్యాసుని దగ్గరకు పంపినప్పుడు ఒక దాసిని కూడా పంపించారు. ఆ దాసికి కలిగిన పుత్రుడు విదురుడు. అందువల్లనే విదురుడు ప్రఖండ విద్యావంతుడు. వేదవ్యాసుని ద్వారా ఉత్పన్నం అవడంవల్ల విదురుడు ధృతరాష్ట్రుడు పాండు రాజులకు అన్నదమ్ముల వరస అవుతాడు. దృతరాష్ట్రుని జీవితంలో అందరికంటే ఎక్కువ దూషించిన వాడు విదురుడు, సంజయుడే. సంజయుడు చివరి శ్లోకంలో యోగేశ్వరుడైన కృష్ణుడు మరియు ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడే విజయం వరిస్తుంది తప్ప తమ పుత్రులకు కాదని మహారాజుకి ధైర్యంగా చెబుతాడు. ఎందుకంటే సంజయుడు సత్యం చెప్పడానికి నియమితుడైన వాడు. విధురుడు సోదరుడు. ధృతరాష్ట్రునికి యుద్ధ వివరాలను తెలియజేయటానికి సంజయునికి వ్యాసుని ద్వారా దివ్యదృష్టి లభించినది. యుద్ధం మొదలైన తరువాత మొదటి పది రోజులు సంజయుడు యుద్ధభూమి లోనే ఉన్నాడు. భీష్ముడు అంపశయ్యపై పడినప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుని దగ్గరకు తిరిగి వచ్చాడు. ధృతరాష్ట్రుడు మొదటి నుంచి జరిగిన విషయాలను విపులంగా చెప్పమని అడుగుతాడు. దివ్యదృష్టి ద్వారా యుద్ధంలో మొదటినుంచి జరిగిన అంశాలను కూడా తిరిగి చూసి సంజయుడు ధృతరాష్ట్రునికి చెబుతాడు. 700 శ్లోకాలు కలిగిన భగవద్గీత మహాభారతంలో ఒక భాగము. ఇందులో 574 శ్లోకాలను భగవంతుడు స్వయంగా చెబుతాడు. 84 శ్లోకాలను అర్జునుడు, 41 శ్లోకాలను సంజయుడు, కేవలం ఒక శ్లోకాన్ని ధృతరాష్ట్రుడు చెబుతారు. ధృతరాష్ట్రుడు చెప్పిన ఏకైక శ్లోకంతో భగవద్గీత ప్రారంభం అవుతుంది. మహాభారతంలో లేనిదంటూ ఏమీ ఉండదు. వ్యాసుడు అన్నిటిని తీసుకొచ్చాడు. ఇందులో భాగమైన భగవద్గీతలోని 700 శ్లోకాలలో మన జీవితానికి అవసరమైన అన్ని సిద్ధాంతాలను పొందుపరిచారు. అనేక మంది ఋషులు, పండితులు గీత వివేచన చేసినప్పటికీ ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం కనిపిస్తూనే ఉంటుంది. పద్దెనిమిది వందల వివేచనలు చెప్పబడిన గ్రంథం ఏది కూడా ప్రపంచంలో లేదు.
హరి నామ సంకీర్తన, ప్రశ్నోత్తరాలు, ప్రార్థన మరియు హనుమాన్ చాలీసా తో వివేచన లోని మొదటి భాగం పూర్తి అయినది.
హరి నామ సంకీర్తన, ప్రశ్నోత్తరాలు, ప్రార్థన మరియు హనుమాన్ చాలీసా తో వివేచన లోని మొదటి భాగం పూర్తి అయినది.
ప్రశ్నోత్తరాలు
ప్రశ్న – భగవద్గీతలో 700 శ్లోకాలలో 574 శ్లోకాలు భగవంతుడు చెబితే, మిగిలినవి ఎవరు చెప్పారు?
సమాధానం – 84 శ్లోకాలను అర్జునుడు, 41 శ్లోకాలను సంజయుడు, కేవలం ఒక శ్లోకాన్ని ధృతరాష్ట్రుడు చెబుతారు.
ప్రశ్న – గీతలో భగవంతుడు ఏది అన్నిటికన్నా పవిత్రమైన వస్తువు అని చెప్పాడు?
సమాధానం – ఇది సాపేక్షతపై ఆధారపడి, సందర్భానుసారంగా మారుతూ ఉంటుంది. ఒక ఖచ్చితమైన సమాధానం అంటూ ఏమీ ఉండదు.
ప్రశ్న – మీ వివేచనలు ఎక్కడ దొరుకుతాయి?
సమాధానం – https://vivechan.learngeeta.com/ లో అన్ని అధ్యాయముల వివేచనలు దొరుకుతాయి.
ప్రశ్న – యూట్యూబ్ లో ఉన్న మీ వివేచన వీడియోలు మా బంధువులతో పంచుకోవచ్చా?
సమాధానం – ఖచ్ఛితంగా పంచుకోవచ్చు.
ప్రశ్న – ఈ వివేచన యొక్క pdf కూడా దొరుకుతుందా?
సమాధానం – ఖచ్ఛితంగా దొరుకుతుంది. pdf మీకు గ్రూప్ లో పంపిస్తారు. అలాగే https://vivechan.learngeeta.com/ లో కూడా దొరుకుతుంది.
ప్రశ్న – భగవద్గీతను చెప్పడానికి ఎంత సమయం పట్టింది?
సమాధానం – ఖచ్ఛితంగా ఇంత సమయం పట్టిందని ఎక్కడ కూడా లేదు. కాని సుమారుగా 45 నిమిషాల పాటు ఈ సంవాదం జరిగిందని చెబుతారు.