विवेचन सारांश
రాజవిద్యా రాజగుహ్యయోగం.
శ్రీకృష్ణ ప్రార్ధన, సరస్వతీ ప్రార్ధన మరియు దీప ప్రజ్వలనముతో వివేచనా కార్యక్రమము ప్రారంభమైనది. శ్రీ ఆశు గోయల్ గారు గురువందనతో తమ వివేచనను మొదలుపెట్టారు. మనం ఈ విధంగా భగవద్గీతను నేర్చుకుంటూ, వివేచన చేసుకోగలుగుతున్నామంటే, అది మన పూర్వజన్మ పుణ్యము, మన పూర్వజులు చేసిన సత్కార్యముల ఫలితము, ఎందరో మహాత్ముల ఆశీర్వచన ఫలితం అని అర్థం చేసుకోవాలి. ఈ భగవద్గీత నేర్చుకోవాలని మనం ఎంచుకోలేదు. భగవంతుడే మనలని ఎంచుకున్నాడు. ఈ విధమైన విశ్వాసం మన మనసులో దృఢతరమవటం వలన మరింత బాగా మనం ఈ భగవద్గీతను అభ్యసించగలుగుతాము. పూజ్య గురుదేవులు భగవద్గీతను జీవితంలో అన్వయించుకోవాలని చెప్తారు. మీరు వివేచనను విన్నాక, అందులో ఏ విషయాలని మీ జీవితంలో అన్వయించుకుని ప్రారంభించాలనుకుంటున్నారో నాకు చాట్ ద్వారా చెప్పండి. ఏడవ అధ్యాయం నుండి పరమాత్ముడు జ్ఞాన విజ్ఞానముల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఏడవ అధ్యాయంలో భగవంతుడు వాడిన కొన్ని పదాల గురించి అర్జునుడికి సందేహం కలిగింది. అధి భూతం, అధిదైవం, అధి యజ్ఞం మొదలైన పదాలకి అర్ధాన్ని వివరించమని కోరాడు. ఎనిమిదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఆ పదాలను చక్కగా వివరించాడు. ఆ తర్వాత అర్జునుడు నీవు ఏడవ అధ్యాయంలో చెప్పిన విషయాలని, తిరిగి చెప్పమని అడగాలి. అలా అడగలేదంటే, వింటున్న విషయాలలో అర్జునుడికి అభిరుచి లేదని అర్థం. శ్రీకృష్ణుడు వివరిస్తున్న విషయం ఏమో గంభీరమైనది; మహత్తరమైనది. అందువల్ల తొమ్మిదవ అధ్యాయం మొదటి రెండు శ్లోకాలలో భగవంతుడు జ్ఞానం గురించి అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని, ఆ జ్ఞానం యొక్క మహత్తును గురించి వివరించాడు. ఈ అధ్యాయం యొక్క పేరే వ్యాసభగవానుడు గొప్పగా 'రాజవిద్యా రాజగుహ్య యోగం' అని పెట్టాడు. మనం అధ్యాయం వివేచన మొదలు పెడతాము.
9.1
శ్రీ భగవానువాచ
ఇదం(న్) తు తే గుహ్యతమం(మ్) , ప్రవక్ష్యామ్యనసూయవే
జ్ఞానం(వ్ఁ) విజ్ఞానసహితం(య్ఁ) , యజ్జ్ఞాత్వా మోక్ష్యసే౽శుభాత్॥9.1॥
శ్రీ భగవానుడు పలికెను - ఓ అర్జునా! నీవు దోషదృష్టిలేని భక్తుడవు. కనుక నీకు పరమగోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మఱల విశిదముగ చెప్పుచున్నాను. దీనిని తెలిసికొని నీవు ఈ దుఃఖరూపసంసారమునుండి ముక్తుడవు కాగలవు.
ఈ శ్లోకంలో పరమాత్ముడు జ్ఞాన విజ్ఞాన సహితమైన, గుహ్యతమమైన జ్ఞానాన్ని చెప్తున్నాడు. జ్ఞానం, విజ్ఞానం మధ్య గల భేదాన్ని గురించి అనేక మంది మహాత్ములు అనేక విధాలుగా చెప్పారు. దీని మీద ఎంతో చర్చ జరిగింది. ఇందులోకి లోతుగా ప్రవేశించామంటే ఆ చర్చ కొన్ని రోజుల పాటు జరుగుతుంది. కాని జ్ఞానం మరియు విజ్ఞానం మధ్య గల తేడాను గురించి ఆదిశంకరాచార్యులు చెప్పిన నిర్వచనమే ప్రమాణంగా తీసుకుంటాము. జ్ఞానం అంటే మనం ఇతరుల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకున్నది.(Through external sources). విజ్ఞానం అనుభవం ద్వారా తెలుసుకునేది. మనం ఎన్నో విషయాలను వింటూ ఉంటాము. అర్థమైనట్టే ఉంటాయి. కాని అనుభవంలోకి వచ్చేవరకు వాటిని మనం పూర్తిగా అర్థం చేసుకోలేము. మనం ఆత్మ, దేహము వేరువేరు; నేను ఆత్మ ని ఈ శరీరాన్ని కాను; అన్న విషయాన్ని ఎన్నోసార్లు విని ఉంటాము. కాని ఇది మనకు అనుభవంలోకి వచ్చిందా? ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాము. పెరుగు తోడు పెట్టడం. ఒక గృహిణి తన భర్తతో పాలు తోడుపెట్టమని చెప్పింది. అదేం పెద్ద విషయమా అని ఆయన ఫ్రిడ్జ్ లో నుంచి పాలు తీసుకోవడానికి వెళ్ళాడు. అందులో నాలుగైదు గిన్నెలలో పాలు ఉన్నాయి. మొదటగా ఏ పాలు తోడ పెట్టాలన్నది ప్రశ్న. అది తెలుసుకున్నాక, వెంటనే అందులో పెరుగు వెయ్యాలా? వేస్తే ఎంత వేయాలి... ఇవన్నీ సందేహాలు. ఆమె ఆ పాలని కాస్త వెచ్చ పెట్టాలని చెప్పింది. పెరుగు చేయడానికి పాలని తిరిగి వేడి చేయడం ఎందుకు అని అతడికి సందేహం కలిగింది. చల్లటి పాలలో పెరుగు వేస్తే తోడుకోవని ఆమె చెప్పింది. తర్వాత కొంచెం గోరువెచ్చగా అయ్యాక అందులో ఒక స్పూను పెరుగు వేసి కలిపి మూత పెట్టమంది. వెంటనే పెరుగు అయిపోతుందా... కాదు. వాతావరణాన్ని బట్టి వేసవికాలంలో అయితే తక్కువ సేపు పడుతుంది. అదే చలికాలం అయితే కాస్త ఎక్కువ సేపు తీసుకుంటుంది... అని ఆమె జవాబు చెప్పింది. అంటే పెరుగు తోడపెట్టడంలో ఎన్ని సాంకేతిక విషయాలు ఉన్నాయా... అని ఆయన ఆశ్చర్యపోయాడు. అంటే ఈ పెరుగు తోడపెట్టడం అన్నది ఎలా అని తెలిసి ఉండడం ఒక విధం. మనమే చేసి తెలుసుకోవడం ఒక విధం. ఇది జ్ఞానం విజ్ఞానాలకి ఉన్న తేడా. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని 'అనసూయవే 'అని సంబోధిస్తున్నాడు. తన ప్రియమైన సఖుడు భక్తుడు అయిన అర్జునుడిని శ్రీకృష్ణుడు ఎన్నో విధాలుగా సంబోధిస్తాడు. అందులో ఈ సంబోధన అసూయ లేనటువంటి అర్జునుడి నిర్మల హృదయాన్ని సూచిస్తుంది. 18 వ అధ్యాయంలో పరమాత్ముడు భక్తుడు కాని వాడికి, ఆసక్తి లేని వాడికి భగవద్గీతను బోధించవద్దని చెప్పాడు. జ్ఞానం పొందడానికి కూడా అర్హత ఉండాలి. సద్గురువు ఏ విధంగానైనా లభిస్తాడు. కాని మంచి శిష్యుడు దొరకడం కష్టం. పూజ్య గురూజీని మీకు సరైన శిష్యులు దొరికారా అని అంటే ఆలోచనలో పడతారు. ఈ విషయంగా ఒక కథ ఉంది. ఒక ఊరిలో ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు. ఒకరోజు ఆయన పక్కనే ఉన్న పట్టణానికి వెళ్లి వస్తూ ఉంటే, దారిలో ఆయన కారు చెడిపోయింది. అక్కడ ఒక మహాత్ముడు పురాణ కథా కాలక్షేపం చేస్తున్నాడు. చాలామంది అక్కడ కూర్చుని ఆయన కథను వింటున్నారు. ధనవంతుడు కూడా కారు రిపేరు అయ్యే వరకు అక్కడ ఖాళీగా ఉన్న ఒక కుర్చీలో కూర్చున్నాడు. ఆ మహాత్ముడు చెప్పిన మాటలు, కథ ఆయన చెవిలోపడ్డాయి. ఆ కథలు వింటూ ఆయన మైమరచిపోయాడు. తర్వాతి రోజు ఆయన కథాకాలక్షేపానికి వెళ్ళాడు. ఆయన గొప్పవాడు కనుక అందరూ ఆయనని స్వాగతించి, ముందు వరసలో కూర్చోబెట్టారు. కాని కథ చెప్తున్న మహాత్ముడు మాత్రం ఆయన కేసి చూడలేదు. ఈ ధనవంతుడికి తన ధనాన్ని చూసుకుని గొప్ప అహంకారం ఉంది. అతడు ఆయన చూపుని ఆకర్షించాలని చాలా ప్రయత్నించాడు. కొంతమంది ఆయన ముందు పళ్ళు, ఫలాలు తెచ్చి పెట్టడం చూశాడు. తరువాతి రోజు 8 గంపల నిండా ఆపిల్ పండ్లు తీసుకుని వచ్చి ఆయన ముందు పెట్టాడు. కాని ఆ మహాత్ముడు వాటికేసి చూడనైనా చూడలేదు. ఆరోజు ఒక వ్యక్తి ఆ గురువుతో 'నాకు దీక్ష ఇప్పించమని 'అడగడం, దానికి ఆ గురువు సరే అలాగే ఇస్తానని చెప్పడం విన్నాడు. అందుకని అతడు కూడా వెళ్లి 'నాకు దీక్ష ఇప్పించండి' అని అడిగాడు. ఆ గురువు 'చూస్తాంలే 'అని వెళ్లిపోయాడు. ఆ ధనవంతుడికి ఎలాగైనా గురువుతో మాట్లాడి, ఆకర్షించాలన్న కోరిక. తర్వాతి రోజు గురువుగారిని ఎవరో భోజనానికి పిలవడం విన్నాడు. తను వెళ్లి 'మా ఇంటికి మీరు దయచేసి భోజనానికి రండి' అని పిలిచాడు. ముందు ఆ మహాత్ముడు ఒప్పుకోలేదు. చాలా బతిమాలాక, "నేను మీ ఇంటికి వస్తాను. కాని మీ ఇంట్లో తినను. నా కమండలంలో ఎంత పడితే అంత తీసుకొని వెళ్ళి ,నా ఆశ్రమంలోనే తింటాను."అన్నాడు ఆ గురువు. అదే భాగ్యం అనుకుని ఆ ధనవంతుడు ఎందుకైనా మంచిది ఒకవేళ గురువు ఒప్పుకుంటే భోజనం చేస్తాడేమోనని చక్కటి భోజనం వండించాడు. అలా కాక కేవలం కమండలంలోనే తీసుకువెళ్తాడు అంటే, చక్కటి పాలతో చేసిన పాయసం వండించాడు. ఐదు రోజులుగా కథాకాలక్షేపం వినడం వలన కలిగిన శ్రద్ధతో, గురువుగారిని తన కారు చక్కగా శుభ్రపరచి అందులో తీసుకుని వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళగానే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ,లోపలికి తీసుకువెళ్లి కూర్చోబెట్టి హారతి ఇచ్చాడు. తిరిగి మా ఇంట్లోనే
భోంచేయమని బతిమాలాడు. కాని ఆ మహాత్ముడు ఒప్పుకోలేదు. సరే. కమండలంలో పాయసం పోస్తామని చూస్తే కమండలంలో పేడ ఉంది. వాసన వస్తూ ఉంది. ఆశ్చర్యపోతూ ఆ ధనవంతుడు అన్నాడు," ఏమిటి స్వామి! ఇటువంటి కమండలం తెచ్చారు! ఇది శుభ్రంగా లేదు. ఇందులో పేడ ఉంది. ఇందులో పాల పాయసం ఎలా పోయడం" అన్నాడు. అప్పుడు ఆ మహాత్ముడు నవ్వుతూ,"నీ మనసులో కూడా ధనము అహంకారము అన్న పేడ నిండిపోయింది. మరి అందులో జ్ఞానం ఎలా నింపగలము? నీకు దీక్ష ఎలా ఇవ్వగలను" అని అడిగాడు. అప్పుడు ఆ ధనవంతుడికి పరివర్తన కలిగి కన్నీటితో ఆయన కాళ్ళ మీద పడ్డాడు. తర్వాత ఆ మహాత్ముడు ఆ ధనవంతుడి ఇంట్లోనే భోంచేసాడు. అందుకే జ్ఞానం పొందాలంటే అర్హత ఉండాలి. ఆ అర్హత అర్జునుడికి ఉంది. గుహ్యతమమైన జ్ఞానం అని పరమాత్ముడు అంటున్నాడు. అంటే అధికారం ఉన్న వాళ్ళకి ఇవ్వదగినది అని అర్థం. సతీదేవి దక్షయజ్ఞంలో తన శరీరాన్ని యోగాగ్నిలో విడిచిన తర్వాత హిమవత్పుత్రిగా జన్మించి అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసి పునీతయై పరమశివుని పతిగా పొందింది. ఆమె సతీదేవిగా ఉండినప్పుడు రామకథను శివుడు చెప్తూ ఉంటే వినడంలో అశ్రద్ధ చేసింది. దానిని గుర్తు చేసుకొని ఇప్పుడు నేను శ్రద్ధతో వింటాను. రామ కథను చెప్పండి అని అడిగింది. అప్పుడు మహాదేవుడు పార్వతీదేవికి చెప్పిన రామాయణ కథని తులసీదాసు రామచరిత మానస్ గా రాశాడు.
गुढ़ऊं तत्व न साधु दुरावाहिं।

आरत अधिकारी जहाँ पायहिं।।
ఆర్తితో అడిగిన వారి దగ్గర, జ్ఞానాన్ని పొందే అర్హత ఉండే వారి దగ్గర గుహ్యతమమైన జ్ఞానాన్ని మహాత్ములు దాచరు.
17వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మూడు రకాలుగా మాట్లాడాలని చెప్పాడు. సత్యం, ప్రియం, హితకరం. ఇప్పుడు అర్జునుడికి హితకరమైన జ్ఞానాన్ని బోధిస్తున్నాడు.
ఈ జ్ఞానాన్ని పొందిన తర్వాత అన్ని అశుభాల నుండి మోక్షం కలుగుతుంది అంటున్నాడు పరమాత్ముడు." గాండీవం స్రంసతే హస్తాత్ ముఖంచ పరిశుష్యతి"... అంటూ విషాదంలో కూరుకుపోయిన అర్జునుడిని ఆ విషాదం నుండి తప్పించడమే కాదు, ఈ జ్ఞానం జన్మ మృత్యు రూపమైన సంసారం నుంచి కూడా ఉద్ధరిస్తుందని దీనికి అర్థం.

రాజవిద్యా రాజగుహ్యం(మ్), పవిత్రమిదముత్తమమ్
ప్రత్యక్షావగమం(న్)ధర్మ్యం(మ్), సుసుఖం(ఙ్) కర్తుమవ్యయమ్।।2।।
ఈ విజ్ఞానసహితజ్ఞానము (నిర్గుణ సగుణ పరమాత్మతత్త్వజ్ఞానము) అన్ని విద్యలకును తలమానికము. సమస్త గోప్యవిషయములకును శిరోభూషణము, అతి పవిత్రము. ఉత్తమోత్తమము. ప్రత్యక్షఫలదాయకము. ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సుగమము, శాశ్వతము.
ఇది రాజ విద్య. అంటే రాజులకు నేర్పే విద్య అని కాదు. విద్యలలో రాజు వంటిది. శ్రేష్టతరమైనది; ఇది రహస్యమైనది; పవిత్రమైనది. పరమాత్ముడు దీని మహత్తును వివరించడానికి చాలా విశేషణాలు వాడాడు. ఇది ప్రత్యక్షంగా అవగతమయ్యేది. అంటే దీని ఫలితం వెంటనే వస్తుందని కాదు. ఉదాహరణకి ఒక తల్లి తన కూతురికి 13 ,14 ఏళ్ల నుంచి రొట్టె ఎలా చేయాలో నేర్పిస్తుంది. మొదట అమ్మాయి రొట్టెని ఒత్తేటప్పుడు అది గుండ్రంగా రాదు. మెల్ల మెల్లగా తల్లి దాన్ని గుండ్రంగా చేయాలంటే ఎలా ఒత్తాలో నేర్పిస్తుంది. ఆ విధంగా ఆ అమ్మాయి ఒక మూడు నెలలో చక్కగా గుండ్రంగా రొట్టెలు చేయడం నేర్చుకుంటుంది. అంటే మొదటి రోజు నుంచి చేసిన సాధన ఆ అమ్మాయికి ఆ పనిలో ప్రావీణ్యం సంపాదించడానికి పనికి వస్తుంది. ఈ జ్ఞానం కూడా అంతే. ఒకసారి శ్రీరామచంద్రుడు తన తమ్ముళ్లు, సీతాదేవితో కూడి కూర్చుని ఉన్నప్పుడు హనుమంతుడిని నీకు ,నాకు గల సంబంధం ఏమిటి అని అడిగాడు. భరత ,శత్రుఘ్నులు , సీతాదేవి హనుమంతుడు ఎక్కడ చిన్న బుచ్చుకుంటాడో అని అనుకున్నారు. కాని మారుతి 'మీకు నాకు గల సంబంధాన్ని మూడు రకాలుగా చెప్పగలను' అన్నాడు. "మొదటిది లౌకికంగా చూస్తే మీరు ప్రభువు, నేను సేవకుడను. ఆధ్యాత్మికంగా చూస్తే మీరు పరమాత్మ, నేను జీవాత్మని. తత్వ పరంగా చూస్తే మీకు నాకు బేధమే లేదు. ఎందుకంటే పరబ్రహ్మం అన్నది ఒక్కటే. (ఏకో బ్రహ్మ ద్వితీయం నాస్తి.తత్వ మసి.) అని జవాబు ఇచ్చాడు.
ఈ జ్ఞానం అవ్యయమైనది. అంటే శాశ్వతమైనది. అవ్యయము, శాశ్వతమైన జ్ఞానం కూడా నష్టమవుతుందా? అంటే మనం ఒక కథ తెలుసుకోవాలి. రామ రావణ యుద్ధంలో ఇంద్రజిత్తు బాణాలతో నాగపాశ బద్ధులై ఉన్న రామలక్ష్మణులని బంధ విముక్తులను చేయడానికి గరుత్మంతుడు రావాల్సి వచ్చింది. అప్పుడు గరుత్మంతుడికి ఒక సందేహం వచ్చింది. పరబ్రహ్మ పరమాత్మయే శ్రీరామచంద్రుడిగా అవతారం తీసుకున్నాడు. అటువంటిప్పుడు ఆయన నాగపాశ బంధాలని నేను విడిపించాల్సిన అవసరం ఏమిటి? ఆయన పరమాత్ముడు కాడా? ఈ సందేహాన్ని శ్రీమహావిష్ణువును నేరుగా అడగడానికి సంకోచించి, గరుత్మంతుడు శివుని వద్దకు వెళ్లి తన సందేహాన్ని చెప్పాడు. దానికి మహాదేవుడు మందహాసం చేసి, "నీ సందేహాన్ని తీర్చడానికి నాకిప్పుడు సమయం లేదు. నీవు కాకభూషణ్డి (రామచరితమానస్ లో ఒక పాత్ర) వద్దకు వెళ్లి నీ సందేహాన్ని తీర్చుకో. అతడి వద్ద ఎక్కువసేపు గడుపు. సత్సంగం వల్లనే సందేహాలు నివృత్తి అవుతాయి " అని చెప్పాడు. కాకభూషణ్డి అంటే ఒక కాకి. మొదట గరుత్మంతుడికి పక్షులలో రాజైన తాను, పక్షులలో కెల్లా హీనమైన పక్షి అయిన కాకి దగ్గర వెళ్లి, సందేహాన్ని తీర్చుకోవాలా అని చిన్నతనం వేసింది. అయినా శివుని ఆజ్ఞకు మేరకు ఆయన కాకభూషణ్డి వద్దకు వెళ్లాడు. కాకభూషణ్డి ఉన్న ఆశ్రమం చుట్టూ ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండడం ఆయన గమనించాడు. గరుత్మంతుడి సందేహాలన్నీ తీరాయి. అప్పుడు ఆయన, " నీవు కాకి యోనిలో ఉన్న ఒక గొప్ప మహాత్ముడివని నాకు అనిపిస్తుంది. నీ జన్మ గురించిన కథ వినాలనికుతూహలంగా ఉంది "అని అడిగాడు."నా జన్మ చరిత్ర 17 కల్పాల నుండి ఉన్నది. మీరు వింటానంటే చెప్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు "అన్నాడు కాకభూషణ్డి. మహాత్ముల కథలు వినడం వలన గొప్ప ప్రయోజనం చేకూరుతుంది నేను వింటానని గరుత్మంతుడు చెప్పాడు. అప్పుడు తన కథను కాకభూషణ్డి ఈ విధంగా వివరించాడు.
17 కల్పాల క్రితం నేను అయోధ్యలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. అనుకోకుండా అక్కడ కరువు సంభవించడం వలన చుట్టుపక్కల ప్రాంతాలకు వలస వెళ్లవలసి వచ్చింది. అయోధ్యలో ఉన్నన్ని రోజులు రామచంద్రుడి మీద అనన్యమైన భక్తి ఉండేది. ఆయన చరిత్రను ఎప్పుడూ గానం చేస్తూ ఉండేవాడిని. వలస వెళ్లాక ఒక ముని ఆశ్రమంలో నాకు నీడ దొరికింది. ఆయన పరమశివుడికి మహా భక్తుడు. నిరంతరం ఆయన సేవ వలన నేను కూడా శివుడి మీద గొప్ప భక్తిని పెంపొందించుకున్నాను. నిరంతరం శివుడిని ఆరాధిస్తూ ఉండేవాడిని. ఒక రోజు నా గురువు 'నీవు అయోధ్యలో ఉండే వాడివి కదా. నాకు రామ కథను చెప్పు' అని అడిగాడు. నా బుద్ధి వక్రమార్గం పట్టి ఉండడం వలన నేను శివుడి కన్నా గొప్ప దేవుడు లేడు. శివుడిని ఆరాధిస్తూ రాముడి కథలు చెప్పుకోవడం అనవసరం అని భావించాను. నాకు గురువు మీద భక్తి తగ్గిపోయింది. ఒకరోజు శివాలయంలో కూర్చుని జపం చేస్తూ నా గురువు వచ్చింది చూసి కూడా ఆయనకి ప్రణామం చేయలేదు. నా గురువు దయాళువైనందున దానిని పెద్దగా పట్టించుకోలేదు. కాని మహాదేవుడికి నా మీద చాలా కోపం వచ్చింది. అప్పుడు ఆకాశవాణి "ఓ ధూర్తుడా! గురువుని గౌరవించలేని నీవు హీనాతిహీనుడివి. నీవు సర్పంగా జన్మించి, ఆ తర్వాత అనేక నీచ యోనిలలో జన్మించుదువు గాక". నా గురువు ఈ మాటలు విని తల్లడిల్లిపోయాడు. ఆయన హృదయం కరిగిపోయి, శివుడి కోసం రుద్రాష్టకం పఠించాడు. అప్పుడు శివుడు అనుగ్రహించాడు. అప్పుడు నేను ఈ విధంగా కాకి రూపంలో ఉన్నాను.నా గురువు నన్ను ఆశీర్వదించి కావాలంటే ఈ కాకి శరీరాన్ని వదిలి నీవు బ్రాహ్మణ యోనిని ధరించవచ్చు అని చెప్పాడు. నేను ఈ శరీరంతోనే ఉంటానని చెప్పాను. నా గురువు నాకు నిరంతరమైన రామ భక్తిని అనుగ్రహించి, నా ఆశ్రమం చుట్టూ ప్రశాంతమైన వాతావరణము, మాయకు, సందేహాలకు చోటు లేనటువంటిదిగా ఉంటుందని చెప్పాడు. నేను 17 కల్పాలుగా ఈ ఆశ్రమంలో ఉంటూ, రామ పాదాలను ఆశ్రయించి, శ్రీరాముడు అవతరించిన ప్రతిసారి ఆయనని దర్శించుకుంటూ ఉన్నాను. నేను గానం చేసే రామ కథని ఇక్కడ ఉండే పశుపక్ష్యాదులు వింటాయి. ఇన్ని కల్పాలుగా ఆయనని దర్శించి కూడా ఒకసారి ఆయన చిన్న బాలుడిగా ఉన్నప్పుడు ఆయన పరమాత్మ యేనా అని సందేహ పడ్డాను. ఆ రెండు చేతులు నన్ను అందుకోవడానికి ముందుకు వచ్చాయి. నేను దూరం జరిగిన కొద్దీ ఆ రెండు చేతులు నాకేసి వస్తూనే ఉన్నాయి. తర్వాత శ్రీరాముడి చరణాలను ఆశ్రయించి, ఆయనే పరమాత్ముడని తెలుసుకున్నాను. జ్ఞానము అవ్యయమైనదైనా జీవుడిని మాయ కప్పేస్తుంది. మాయ భగవంతుడి అధీనంలో ఉంటుంది... అన్నదానికి ఈ కథ చక్కటి ఉదాహరణ.

అశ్రద్దధానాః(ఫ్) పురుషా, ధర్మస్యాస్య పరన్తప
అప్రాప్య మాం(న్) నివర్తన్తే, మృత్యుసంసారవర్త్మని।।3।।
ఓ పరంతపా! ఈ ధర్మమార్గమునందు విశ్వాసములేని పురుషులు నన్ను పొందజాలరు. కనుక వారు మృత్యురూపసంసారచక్రమున పరిభ్రమించుచుందురు.
భక్తి మార్గమైనా, కర్మ మార్గమైనా, జ్ఞానమార్గమైనా శ్రద్ధ ముఖ్యము. శ్రద్ధ లేనప్పుడు దేనినీ సాధించలేము. జ్ఞానము యొక్క, శ్రద్ధ యొక్క ప్రాముఖ్యతను గురించి పరమాత్ముడు 4, 5 ,6 అధ్యాయాలలో విశదంగా వివరించాడు. శ్రద్ధ లేని వారు పరమాత్ముడిని పొందలేరు. ఇది కొంచెం క్లిష్టమైనది. నిరంతరమైన అభ్యాసం వల్లనే అర్థం అవుతుంది. శ్రద్ధ లేని మానవులు జన్మ మృత్యు రూపమైన సంసార చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటారు.
మయా తతమిదం(మ్) సర్వం(ఞ్), జగదవ్యక్తమూర్తినా
మత్స్థాని సర్వభూతాని, న చాహం(న్) తేష్వవస్థితః।।4।।
నిరాకారపరబ్రహ్మనైన నాచేతనే ఈ జగత్తంతయును జలముతో మంచువలె పరిపూర్ణమైయున్నది. ప్రాణులన్నియును నా సంకల్పమును ఆధారముగా కలిగి నాయందే అంతర్గతములైయున్నవి. కాని వాస్తవముగా నేను వాటియందు స్థితుడనుకాను.
ఈ శ్లోకంలో పరమాత్ముడు ప్రాణులన్నీ తనయందే అంతర్గతమై ఉన్నాయని,. కాని వాటి యందు తాను లేనని చెప్తున్నాడు. ఈ చరాచర ప్రపంచమంతా పరమాత్ముడి సంకల్పం వల్లనే ఏర్పడింది. కాని అందులో ఆయన లేడు. ఇది అర్థం చేసుకోవడం కొంచెం కఠినంగా అనిపించవచ్చు. మహాత్ములైన వారు కొన్ని ఉదాహరణలు చెప్పారు. మనం సముద్రంలో లేదా నదిలో కెరటాలు లేవడం చూస్తుంటాము. ఆ తరంగంలో ఉన్నది జలమే. కాని ఆ తరంగాన్ని మనం పట్టుకోలేము. ఆ తరంగాన్ని మనం ముట్టుకుంటే మన చేతికి జలం అంటుకుంటుంది. ఒక చిత్రకారుడు సిరాతో ఒక చిత్రాన్ని గీశాడని అనుకుందాము. ఆ చిత్రంలో పర్వతాలు, నదీ నదాలు, చెట్లు, మనుషులు ఈ విధంగా చిత్రీకరించాడు. అతడు చిత్రీకరించడానికి ముందు ఆ సిరాలో ఇవి ఉన్నాయా? చిత్రీకరించిన వాటిలో విడిగా మనకు సిరా కనిపిస్తుందా? పాలను తోడు పెడితే పెరుగు తయారవుతుంది. కాని పెరుగులో నుంచి పాలను వేరు చేయగలమా? పెరుగులో పాలు ఉంటుందా? పాలలో పెరుగు ఉంటుందా? ఈ రకంగా విశ్లేషణ చేసి ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి మీరు బయట నిలబడితే మీ నీడ కనిపిస్తుంది. ఆ నీడ అంతవరకు మీలో ఉందా? నీడలో మీరు ఉన్నారా? నీడలో మీరు లేరు. మీలో నీడ లేదు. నీడ మీ వల్లనే ఏర్పడింది. కాని అందులో మీరు లేరు! ఈ జడ ప్రపంచమంతా పరివర్తనాశీలమైనది. పుడుతుంది; పెరుగుతుంది; నశిస్తుంది. సంసరతి ఇతి సంసారః... అన్నారు. కాని భగవంతుడు అవ్యయుడు; శాశ్వతుడు; అవినాశి. కనుక ఆయన జడ పదార్థాలలో లేడు. చైతన్య స్వరూపమైన పరమాత్మ కి జనన మరణాలు లేవు. మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం తీసుకున్న మన ఫోటోని ఎవరైనా మనకు చూపిస్తే ఒక్కొక్కసారి మనం గుర్తుపట్టలేము. మనం నిద్రపోతున్నప్పుడు శరీరం లోని ఇంద్రియాలు పనిచేయవు. కాని శరీరంలో ఉన్న నేను మాత్రం పని చేస్తూనే ఉంటుంది. మన చిన్నప్పటి నుంచి శరీరంలో ఎన్ని మార్పులు సంభవించినా , ఈ నేను మాత్రం ఒకే విధంగా అలాగే ఉంది. శరీరంతో పాటు మారదు. అందుకే అన్నారు "బ్రహ్మ సత్యం జగం మిథ్యం". మన వల్ల ఏ విధంగా నీడ ఏర్పడిందో, ఈ జడ ప్రపంచమతా పరమాత్ముడి వలన ఏర్పడింది.
న చ మత్స్థాని భూతాని, పశ్య మే యోగమైశ్వరమ్
భూతభృన్న చ భూతస్థో, మమాత్మా భూతభావనః।।5।।
ఈ ప్రాణులన్నియును నాలో స్థిరముగా లేవు. ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడుము. ఈ భూతములన్నింటిని సృష్టించునదియు, పోషించునదియు నేనేయైనను యథార్థముగా నా ఆత్మ వాటియందు స్థితమై యుండదు.
9.5 writeup
యథాకాశస్థితో నిత్యం(వ్ఁ), వాయుః(స్) సర్వత్రగో మహాన్
తథా సర్వాణి భూతాని, మత్స్థానీత్యుపధారయ॥9.6॥
ఆకాశమునుండి ఉత్పన్నమై సర్వత్ర సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమైయుండును. అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు (ప్రాణులు) అన్నియును నాయందే స్థితమై యుండును అని ఎఱుంగుము.
9.6 writeup
సర్వభూతాని కౌన్తేయ, ప్రకృతిం(య్ఁ) యాన్తి మామికామ్
కల్పక్షయే పునస్తాని, కల్పాదౌ విసృజామ్యహమ్॥9.7॥
ఓ కౌంతేయా! కల్పాంతమునందు భూతములన్నియును నా ప్రకృతినే చేరును. అనగా ప్రకృతిలో లీనమగును. కల్పాదియందు నేను మఱల వాటిని సృజించుచుందును.
కల్పాదియందు సర్వప్రాణులను పరమాత్ముడు సృజిస్తాడు. కల్పాంతంలో ఆ ప్రాణులన్నింటినీ ప్రళయంతో నశింపజేస్తాడు. ఉదాహరణకి చిన్న పిల్లలు ఇంట్లో మ్యాజిక్ క్లే (ఒక విధమైన బంకమన్ను) తో ఆడుకుంటారు. దానితో రకరకాల జంతువులు, పళ్ళు, పూలు, ఆకారాలు చేస్తారు. వాళ్ళ అమ్మ వచ్చి ' రూమ్ అంతా పాడు చేశారు. అన్ని తీసి శుభ్రం చేయండి' అని అరుస్తుంది. వాళ్లు ఆ బొమ్మలన్నింటినీ కలిపేసి, ఒక బంతి లాగా ముద్దచేసి భద్రం చేసి పెడతారు. తరువాతి రోజు అదే విధంగా మళ్ళీ ఆడుకుంటారు. ఇదేవిధంగా, బ్రహ్మ మొత్తం విశ్వాన్ని సృష్టిస్తాడు. కానీ ఒక్క విషయం గమనించాలి. బ్యాంకులో రొక్కం అప్పు తీసుకుని, దాన్ని చెల్లించకుండా అంతా ఖర్చు పెట్టేస్తే, మన ఖాతాలో ఆ ఋణము అలాగే ఉంటుంది. మన కర్మ ఫలితాలు కూడా అలాగే ఉంటాయి.
ప్రకృతిం(మ్) స్వామవష్టభ్య, విసృజామి పునః(ఫ్) పునః
భూతగ్రామమిమం(ఙ్) కృత్స్నమ్, అవశం(మ్) ప్రకృతేర్వశాత్।।8।।
తమతమ స్వభావవశమున పరతంత్రమైయున్న భూతసముదాయమును నాప్రకృతినాశ్రయించి మాటిమాటికి వాటి కర్మానుసారము సృజించుచున్నాను.
జీవులన్నీ తమ స్వభావాన్ని అనుసరించి పరతంత్రులై ఉంటాయి. వాటి కర్మ ఫలితాలను అనుసరించి కల్పాదియందు బ్రహ్మ వాటిని సృష్టిస్తాడు. జన్మ అనేది ఏ విధంగా వస్తుంది... చెట్టు గానా, జలచరంగానా, పాకే జంతువు గానా, నడిచే జంతువు గానా, మనిషిగానా అన్నది ఆ జీవి యొక్క కర్మలను అనుసరించి ఉంటుంది. అదేవిధంగా ధనము, బలము, సౌందర్యము, బంధుత్వాలు, మిత్రత్వాలు... ఇవన్నీ కూడా జన్మాంతర కర్మలను బట్టి వస్తాయి. ప్రళయం తరువాత జీవులన్నీ నశించినా, వాటి కర్మల యొక్క గణన ముగిసిపోదు. ఇది నిరంతరంగా సాగుతూనే ఉంటుంది.
న చ మాం(న్)తాని కర్మాణి, నిబధ్నన్తి ధనఞ్జయ
ఉదాసీనవదాసీనమ్, అసక్తం(న్) తేషు కర్మసు।।9।।
ఓ అర్జునా! ఆ సృష్ట్యాది కర్మలయందు ఆసక్తిరహితుడనై, ఉదాసీనునివలెనున్న నన్ను ఆ కర్మలు బంధింపవు.
ఓ అర్జునా! ఏ విధంగా అయితే నీకు కర్మలు ఉన్నాయో అదేవిధంగా నాకు కూడా కర్మలు ఉంటాయా అన్న సందేహం నీకు రావచ్చు. నేను ఈ సృష్టిని సృజిస్తాను.. ప్రళయంలో లయం చేస్తాను. నీకు ,నాకు కర్మ ఫలితాలు సమానంగానే ఉంటాయి. కాని నాకు కర్మల యందు ఆసక్తి లేదు. అనాసక్తంగా ఆ కర్మలు చేయడం వలన నన్ను కర్మ ఫలితాలు అంటవు. సూర్యుడు అందరికీ ప్రకాశాన్ని సమానంగా పంచుతాడు. ఆ సూర్యకాంతిలో కొందరు వ్యవసాయం చేస్తారు. కొందరు సత్కర్మలను ఆచరిస్తారు. కొంతమంది అదే సూర్యకాంతిలో హింసాత్మకమైన పనులు చేస్తారు. పాపాలు చేస్తారు. కాని సూర్యుడు పాపం చేసిన వారికి తక్కువ, పుణ్యం చేసిన వారికి ఎక్కువగా కాంతిని ఇవ్వడు. పరమాత్ముడికి అందరూ సమానమే. ఆయన కర్మలలో ఆసక్తి చూపడు. అందువలన కర్మ ఫలితాలు ఆయనని బంధించవు.
अब सौंप दिया इस जीवन का, सब भार तुम्हारे हाथों में,
अब सौंप दिया इस जीवन का, सब भार तुम्हारे हाथों में,
हे जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में ll
ఇప్పుడు జీవిత భారాన్ని నీ చేతుల్లోనే ఉంచాను. గెలుపైనా, ఓటమైనా నీ చేతుల్లోనే...
అని అర్థం గల ఒక చక్కటి భజన ఆలపించారు.
'హరీ శరణం ' అన్న కీర్తనతో వివేచన ముగిసింది. ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభమైంది.
ప్రశ్న: నామ జపం కాని, స్తోత్రాలు కాని శ్రద్ధగా చేయాలని అంటారు. కాని శ్రద్ధ లేకుండా తెలిసీ తెలియక చేసిన నామ జపం కూడా ఫలితం ఇస్తుందని అంటారు. ఏది నిజం? నామ జపం, హనుమాన్ చాలీసా మొదలైనవి ఒకచోట కూర్చునే చేయాలా?
జవాబు: నామ జపం అయినా, స్తోత్ర పాఠాలైనా శ్రద్ధతో చేస్తేనే ఫలితం ఉంటుంది. ఒక్కచోట కూర్చుని ఏకాగ్రతతో చేసినప్పుడే పరమాత్మ మీద మనసు లగ్నమైతుంది. శ్రద్ధ లేకుండా తెలిసి తెలియక చేసిన నామ జపము ,నామ జపములో శ్రద్ధను కలిగిస్తుంది... అని అంటారు.
ప్రశ్న: భగవద్గీత పనిచేసుకుంటూ లేదా తిరుగుతూ చదివినా తప్పు లేదా?
జవాబు: భగవద్గీతకు అశౌచము లేదు. కనుక ఎలా చదివినా తప్పులేదు. కాని ఒక్కచోట కూర్చుని పరిశుద్ధంగా, ఏకాగ్రతతో చదివినప్పుడు ఎక్కువ ఫలితం ఉంటుంది.
ప్రశ్న: మనసును ఏకాగ్రం చేయడం ఎలా కుదురుతుంది?
జవాబు: భగవద్గీత రోజూ చదవడం వల్ల కూడా మనసుకు ఏకాగ్రత కుదురుతుంది. ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని మీద దృష్టి పెట్టాలి. ఒక యజమాని సేవకుడిని ఎలా నియంత్రిస్తాడో ఆ విధంగా మన మనసుని మనం నిగ్రహించగలగాలి. అప్పుడు ఏకాగ్రత సాధ్యం అవుతుంది.
ప్రశ్న: నేను రోజూ హనుమాన్ చాలీసా, రామచరిత మానస్ చదువుతాను. మృత్యుంజయ జపమూ చేస్తాను. ఇది సరైనదేనా?
జవాబు: అది యోగ్యమైనదే. ఆదిశంకరాచార్యులు రోజూ పంచాయతన పూజ చేయాలని చెప్పారు. దానితో పాటు ఇష్ట దైవాన్నీ పూజించాలి.
ప్రశ్న: మన కర్మలన్నింటికీ ఫలితాలని ఈ జన్మలోనే అనుభవించాలా?
జవాబు: అలా కాదు. మనం అనుభవిస్తున్న ఫలితాలని ప్రారబ్ద కర్మ అంటారు. ఇవి కాక సంచిత కర్మలు ఉంటాయి. వాటిని ముందు జన్మలలో అనుభవించాల్సి వస్తుంది. సత్కర్మలను ఆచరించడం వలన పాప క్షయం అవుతుంది.
ప్రశ్న: ఇతరుల లో తప్పులు ఎంచే స్వభావాన్ని ఏ విధంగా పోగొట్టుకోవచ్చు.
జవాబు: ఆ విధంగా తప్పులు ఎంచే ముందు, మనల్ని మనం ఆత్మ విశ్లేషణ చేసుకోవాలి. మనకు ఆ అధికారం ఉందా అని మనం ప్రశ్నించుకోవాలి. అలా తప్పులు ఎంచినందుకు మనల్ని మనమే శిక్షించుకోవాలి. ఈ నియమాల్ని పాటించినప్పుడు ఆ స్వభావం తగ్గుతుంది.
ప్రార్థన తో , హనుమాన్ చాలీసా పఠనంతో వివేచనా కార్యక్రమం ముగిసింది.