विवेचन सारांश
భక్తియోగము -భక్తుల లక్షణములు
శ్రీ కృష్ణ ప్రార్ధన , శారదాస్తుతి, దీప ప్రజ్వలన ముగిసిన తర్వాత గురువందన చేసి, శ్రీ ఆశూగోయల్ గారు ఈనాటి ఈ వివేచన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
భగవానునికి అత్యంత ప్రీతిపాత్రులవ్వాలంటే ఏ లక్షణాలను భక్తులు కలిగి ఉండాలో ఈ12వ అధ్యాయపు ద్వితీయభాగం మనకు స్పష్టం చేస్తుంది. మన జీవితాలను అర్థవంతంగా మలచుకోవడానికి భగవంతుడు మనకు ఇచ్చిన వరం ఈభగవథ్గీతా పఠనం. మన పూర్వీకుల యొక్క పుణ్య కార్యాల వలన కూడా మనకి ఈ అదృష్టం కలిగి ఉండవచ్చు. భగవద్గీతా కు సమానమైన గ్రంధం వేరొకటి లేదు. గీతాలో భగవంతుని ద్వారా ప్రతి ఒక్కరి నిత్య జీవిత సమస్యలకు పరిష్కారం సూచించబడింది.
ఈ శ్లోకాలలో భక్తులు తనను చేరుకోగలిగే సునాయాస భక్తి మార్గాలను గురించి భగవంతుడు విశదీకరించారు. భక్తులకు ముఖ్యం గా ఉండవలసిన 39 లక్షణాలలో ఏ ఒక్క లక్షణం కలిగి ఉన్నా, మానవులు ఈ మార్గాలలో భగవంతుని చేరవచ్చు.
దీపం వెలిగించగానే వెలుగు ఎలా వ్యాపిస్తుందో, భక్తి యోగము చదవడం వల్ల మన జీవితాలలో కూడా ప్రకాశం అలాగే వ్యాపిస్తుంది. అందుకే ప్రపంచమంతటా ఈ గీతామకరందాన్ని పంచే యఙ్ఞములో అందరూ పాల్గొంటున్నారు. భగవద్గీతాలో ఉన్న 700 శ్లోకాలలో ఒక్క శ్లోకం ధృతరాష్ట్రుడు, 41శ్లోకాలు సంజయుడు, 84 శ్లోకాలు అర్జునుడు, 574 శ్లోకాలు శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పారు.
ఈ ద్వితీయభాగం లో భగవంతుడు చెప్పిన భక్తి మార్గాల గురించి, భక్తుల లక్షణాల గురించి తెలుసుకుందాము.

12.12
శ్రేయో హి జ్ఞానమభ్యాసాజ్, జ్ఞానాద్ధ్యానం(వ్ఁ) విశిష్యతే।
ధ్యానాత్కర్మఫలత్యాగః(స్) , త్యాగాచ్ఛాన్తిరనన్తరమ్৷৷12॥
తత్త్వము నెఱుంగకయే చేయు అభ్యాసముకంటెను జ్ఞానము శ్రేష్ఠము. కేవలము పరోక్ష జ్ఞానము కంటెను అనగా అనుభవరహితమైన జ్ఞానముకంటెను (శాస్త్ర పాండిత్యముకంటెను) పరమేశ్వరస్వరూపధ్యానము శ్రేష్ఠము. ధ్యానము కంటెను కర్మఫలత్యాగము మిక్కిలి శ్రేష్ఠమైనది. ఏలనన త్యాగమువలన వెంటనే పరమశాంతి లభించును.
12.12 తత్వ గ్రహణము లేని అభ్యాసం కన్నా ఙ్ఞానము గొప్పది. పూజ, శ్రవణము వంటి కార్యాలను మనము ఇంద్రియాలతో చేస్తుంటాము. వీటిని శ్రధ్ధగా చేయాలంటే మనసు మన నియంత్రణలో ఉండాలి. దీనికి అభ్యాసం ఎంతో అవసరం. ఈ అభ్యాసం కన్నను ఙ్ఞానము శ్రేష్ఠమైనది. ఙ్ఞానము కంటే భగవధ్యానము గొప్పది. కర్మ ఫలత్యాగము వీటన్నిటి కన్నను మిక్కిలి ఉత్తమము. నాది, నా వారు, నా వస్తువు అన్న వ్యామోహం ఉన్నంతవరకూ మన అహంకారం పోదు. ముక్తిని కూడా పొందలేము. అందువలన మార్గం ఏది ఎంచుకున్నా, నిశ్చలచిత్తం తో గమ్యం చేరడానికి ప్రయత్నించాలి.
అద్వేష్టా సర్వభూతానాం(మ్), మైత్రః(ఖ్)కరుణ ఏవ చ।
నిర్మమో నిరహఙ్కారః(స్), సమదుఃఖసుఖః క్షమీ৷৷13॥
ఏ ప్రాణియందును ద్వేషభావము లేనివాడును, పైగా సర్వప్రాణులయందును అవ్యాజమైనప్రేమ, కరుణ కలవాడును, మమతాహంకారములు లేనివాడును, సుఖము ప్రాప్తించినను, దుఃఖము ప్రాప్తించినను, సమభావము కలిగియుండువాడును, క్షమాగుణము కలవాడును (అపరాధికిని అభయమును ఇచ్చువాడును)...
12.13 భక్తుని యొక్క ప్రధమలక్షణం ద్వేషం లేకుండా ఉండటం. ఇతరుల అభివృద్ధి చూసి చింతించకూడదు. సర్వ ప్రాణులపట్ల కరుణ, ప్రేమ, సుఖదుఃఖాలయందు సమతుల్యత, క్షమాగుణం,ఈర్ష్యారాహిత్యం, భక్తులలో భగవంతుడు కోరుకునే లక్షణాలు. ఇవే కాకుండా.........
సన్తుష్టః( స్) సతతం(య్ఁ) యోగీ, యతాత్మా దృఢనిశ్చయః|
మయ్యర్పితమనోబుద్ధిః(ర్) ,యో మద్భక్తః(స్) స మే ప్రియః৷৷14॥
...సర్వకాల సర్వావస్థలయందును సంతుష్టుడైయుండు యోగియు, శరీరేంద్రియ మనస్సులను వశమునందుంచుకొనినవాడును, నాయందు దృఢమైన నిశ్చయము గలవాడును, అయి నాయందే మనోబుద్దులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు.
12.14 సర్వకాల సర్వావస్ధలందు సంతుష్టుడు, మనోఇంద్రియనిగ్రహము, ధృఢనిశ్చయముకలవాడు, నాది, నేను అనే భావన మరియు మమకారము లేనివాడు, దయ, కరుణ మానవత్వము కలవాడు, మనస్సు, బుద్ధి కృష్ణునికే అర్పణ చేసినవాడు ఆ దేవాదిదేవునికి అత్యంత ప్రియభక్తుడు.
వ్యామోహం తగ్గితే భక్తి పెరుగుతుంది. దంపతులు రిఫ్రిజిరేటర్ కొనడానికి ఒక దుకాణానికి వెళ్ళి, నచ్చిన దానిని ఎంచుకున్నారు. సేల్స్ మాన్ దానిని వేరే వారు తీసుకోకుండా ఉండటం కోసం "సోల్డ్ " అని వ్రాశి రశీదు తయారుచేస్తున్నాడు. ఇంతలో ఆ దుకాణం లో రద్దీ పెరిగింది. ఇంకా డబ్బు చెల్లించకపోయినా, ఆ వస్తువు వారి సొంతం కాకపోయినా, పనివారు మోసుకొస్తున్న వస్తువుల వలన తమ ఫ్రిడ్జ్ కి గీతలు పడవచ్చని ఆందోళన పడసాగారు ఆ దంపతులు. నాది అనే ఈ భావనే మానవులని బంధాలతో కట్టివేస్తుంది.
మహాభారతం లో యక్షుడు ధర్మరాజు ని "ఈ లోకంలో దరిద్రుడు ఎవరు?"అని అడిగాడు. దానికి సమాధానం గా ధర్మరాజు "సంతృప్తి అన్నది లేనివాడే అత్యంత దరిద్రుడు " అని చెప్పారు.
భక్తులకు ఉండవలసిన మరో లక్షణమైన నిశ్చయానికి ఉదాహరణ పార్వతీఅమ్మవారు. తన గురువైన నారదుల వారి సలహాతో పరమేశ్వరుడిని పరిణయం చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు ఘోరతపస్సు చేసారు. ఆమె మనసు మార్చడానికి సప్తర్షులు వచ్చి శివుని తక్కువచేసి మాట్లాడినా సరే ఆమె తన నిశ్చయాన్ని మార్చుకోలేదు. గిరి పుత్రికను కనుక నా మనసు కూడా రాతి వంటిదే అని వారికి చెప్పి తన తపోబలం, ధృఢనిశ్చయంతో చివరికి ఆ పరమశివుడిని పరిణయమాడినారు.

యస్మాన్నోద్విజతే లోకో, లోకాన్నోద్విజతే చ యః|
హర్షామర్షభయోద్వేగైః(ర్),ముక్తో యః(స్) స చ మే ప్రియః৷৷15॥
లోకమున ఎవరికిని ఉద్వేగము (క్షోభ) కలిగింపనివాడును, ఎవరివలనను తాను ఉద్వేజితుడు కానివాడును (ఉద్వేగమునకు గురికానివాడును), హర్షము, ఈర్ష్య, భయము, ఉద్వేగము మున్నగు వికారములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు.
12.15 తన ప్రియభక్తుల లక్షణాలు గురించి కృష్ణ పరమాత్మ ఇంకా ఇలా తెలిపారు. ఈలోకం లో ఎవరికీ ఉద్వేగం కలిగించని వాడు, ఎవరి వలన తాను ఉద్వేగం పొందనివాడు, కోపము, భయము, ఈర్ష్య, అతిసంతోషము వంటి గుణాలు లేని వారు భగవంతుని ప్రియభక్తులు.
భర్తృహరి నీతిశతకం లో ఇలా చెప్పబడింది.
హరిణి(జింక), చేప, సజ్జనుడు ఎవరికీ హాని తలపెట్టకుండా తమతమ నివాసాలలో ఉంటారు. కాని వేటగాడి వలన జింకకు,మత్యకారుని వలన చేపకు, దుష్టుని వలన సజ్జనుడికి అపాయం ఉంటూనే ఉంటుంది. ఎట్టి అసహనానికి లోను కాకుండా ఇటువంటి వారి నుండి అప్రమత్తం గా ఉండాలి.
భయాలకు,ఉద్వేగాలకు,సంతోషాలకు అతీతమైన స్థితి ని పొందగలగాలి.

అనపేక్షః(శ్)శుచిర్దక్ష,ఉదాసీనో గతవ్యథః|
సర్వారమ్భపరిత్యాగీ,యో మద్భక్తః(స్) స మే ప్రియః৷৷16॥
ఏమాత్రమూ కాంక్షలేనివాడు, శరీరేంద్రియమనస్సులయందు శుచియై యున్నవాడును, దక్షుడును, పక్షపాతరహితుడును, ఎట్టి దుఃఖములకును చలింపనివాడును, సమస్తకర్మల యందును కర్తృత్వాభిమానములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు.
12.16 ఏ మాత్రమూ కాంక్ష లేనివాడు, మనస్సు, శరీరము, ఇంద్రియాల శుచి గలవాడు, కర్తవ్యాన్ని శ్రద్ధ గా చేయగల దక్షత కలవాడు, పక్షపాతరహితుడు అయిన భక్తుడు భగవానునికి అత్యంత ప్రీతిపాత్రుడు. దేహశుభ్రత, పూజాగృహ నియమపాలన, నివాసస్థల మరియు పరిసర శుభ్రత ఎంతో ముఖ్యం.
దక్షత గురించి చిన్నకధ చెప్పుకుందాము.
వ్యాపార నిమిత్తం ఒక ఊరు వెళ్ళిన ముగ్గురు వ్యక్తులు
ఒకేచోట బస చేయడం వలన మిత్రులవుతారు. ఒకరోజు మూడవ వ్యక్తి వద్ద తినడానికి ఏమీ లేదని గ్రహించిన ఒక మిత్రుడు తనవద్ద ఉన్న 5రొట్టెలను,ఇంకొక మిత్రుడు తనవద్ద వున్న 3రొట్టెలను కలిపి, ఒక్కోరొట్టెను 3భాగాలుగా చేసి, తిని , నిద్రించారు.ఉదయం లేచి చూస్తే మూడవ మిత్రుడు కన్పించలేదు.వారికి ఒక లేఖ, దాని పక్కనే 8బంగారు నాణాలు కన్పించాయి. ఆ లేఖ లో వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆ నాణాలు వారికే అని ఉంది.
ఆ 8బంగారునాణాల పంపిణీలో విబేధాలు రావడం వలన ఆ ఇరువురు న్యాయం కోసం గ్రామాధికారి వద్దకు వెళ్ళారు.ఆయన మొదటి వ్యాపారికి 1నాణెం,రెండవ వ్యాపారికి 7నాణాలు పంచాడు. మొదటి వ్యాపారి తన వద్ద ఉన్న 5రొట్టెలను 15 ముక్కలు చేసి 8ముక్కలు తను తిని 7ముక్కలు మూడవ వ్యాపారికి ఇవ్వడం వలన అతనికి 7నాణెం ఇచ్చాడు. రెండవ వ్యాపారి తనవద్ద ఉన్న 3రొట్టెలను 9ముక్కలు చేసి , 8ముక్కలు తను తిని 1ముక్క మూడవ వ్యాపారికి ఇవ్వడం వలన అతనికి 1నాణెము ఇచ్చాడు. గ్రామాధికారి తన తెలివితేటలతో, దక్షత తో 7ముక్కలు ఇచ్చిన వానికి 7నాణాలు,1ముక్క వానికి 1నాణెం ఇచ్చి, వారి సమస్యను పరిష్కరించాడు. అంతేకాకుండా ఎట్టి పక్షపాతం లేకుండా ఇరువురిని సమదృష్టితో చూడడం వలన సరైన తీర్పు ఇవ్వగలిగాడు.
అనుకున్నది జరగనప్పుడు కోపము,దుఃఖము కలుగుతాయి.కాని అదంతా భగవత్పాప్తాప్తి అని భావించి నిశ్చింతుడై ఉండటం భక్తుని లక్షణము.

యో న హృష్యతి న ద్వేష్టి,న శోచతి న కాఙ్క్షతి।
శుభాశుభపరిత్యాగీ,భక్తిమాన్యః(స్) స మే ప్రియః॥17॥
ఇష్టవస్తుప్రాప్తికి పొంగిపోనివాడును, దేనియందును ద్వేషభావము లేనివాడును, దేనికినీ శోకింపనివాడును, దేనినీ ఆసింపనివాడును, శుభాశుభకర్మలను త్యజించినవాడును, ఐన భక్తుడు నాకు ప్రియుడు.
12.17
దేనియందు ద్వేషములేనివాడు,సుఖదుఃఖాలకు ఒకేరీతిగా స్పందించువాడు, శుభాశుభకర్మల ఫలితాలను త్యజించిన వాడు, దేనినీ ఆశించనివాడు భగవంతుని ప్రియభక్తుడు.

సమః(శ్)శత్రౌ చ మిత్రే చ,తథా మానాపమానయోః।
శీతోష్ణసుఖదుఃఖేషు, సమః(స్) సఙ్గవివర్జితః॥18॥
శత్రువులయెడను, మిత్రులయెడను సమభావముతో మెలగువాడును, మానావమానములు, శీతోష్ణములు, సుఖదుఃఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును, ఆసక్తిరహితుడును....
12.18
వెలుగు వెంట నీడ, సుఖము వెంట దుఃఖము,మిత్రుల వెనుక శతృవులు ఉండుట సహజము. ఇది తెలుసుకోకుండా క్రియకు ప్రతిక్రియ చేయాలనుకోవడం మానసిక హింసే అవుతుంది. మానావమానములు,శీతోష్ణ సుఖదుఃఖాల పట్ల సమబుధ్ధి గలవాడు, స్ధితప్రజ్ఞుడు అయిన భక్తుడు భగవానునికి ఎంతో ఇష్టుడు.

తుల్యనిన్దాస్తుతిర్మౌనీ, సన్తుష్టో యేనకేనచిత్।
అనికేతః(స్) స్థిరమతిః(ర్), భక్తిమాన్మే ప్రియో నరః॥19॥
నిందాస్తుతులకు చలింపనివాడును, మననశీలుడును, శరీరనిర్వహణకై లభించిన దానితోడనే తృప్తిపడువాడును, నివాసస్థానములయందు మమతాసక్తులు లేనివాడును, స్థితప్రజ్ఞుడును అగు భక్తుడు నాకు ఇష్టుడు.
12.19
ఎవరు నిందించినా, అవమాన పరచినా చలించక, తనకు లభించిన దానితోనే సంతృప్తి చెందుతూ, తన నివాసస్ధలముల పట్ల కూడా అత్యాసక్తి చూపక, స్ధిరమైన భక్తి భావంతో జీవించు భక్తుడు దేవదేవునికి అత్యంత ప్రీతిపాత్రుడు. భగవంతునికి ఎప్పుడూ ప్రియభక్తుడిగా ఉండదలచి హనుమంతుడు చేసిన ప్రయత్నాన్ని తెలుసుకుందాము.
సీతమ్మ వారు ఎప్పుడూ నుదిటిమీద, పాపిట్లో సింధూరం ధరించేవారు. దానికి కారణం ఏమిటి అని హనుమ అడిగితే, శ్రీ రామచంద్రునికి ఆ సింధూర అలంకరణ ఇష్టమని చెప్తారు. వెంటనే ఆంజనేయ స్వామి శరీరమంతా సింధూరపు పూతతో తన స్వామి కోసం తయారయ్యారు. భగవంతుని పట్ల భక్తునికి గల భక్తి భావము అట్టిది. అందుకే దేవాలయాలలో ఆంజనేయుని విగ్రహం సింధూరంతో నిండి ఉంటుంది.

యే తు ధర్మ్యామృతమిదం(య్ఁ), యథోక్తం(మ్) పర్యుపాసతే।
శ్రద్దధానా మత్పరమా, భక్తాస్తే౽తీవ మే ప్రియాః৷৷20॥
ఉపర్యుక్తధర్మ్యామృతమును సేవించుచు (పైనపేర్కొనభడిన ఉత్తమ గుణములను కలిగియుండి), నిష్కామభక్తిశ్రద్దలతో మత్పరాయణులైన భక్తులు నాకత్యంత ప్రియులు.
12.20
సర్వ ప్రాణుల ఎడ కరుణ, ప్రేమ, మమకార రాహిత్యము, మిత్రత, క్షమ, ధృఢనిశ్చయము, ఈర్ష్యారాహిత్యం, సావధానత, అనుకూల ప్రతికూలతలయందు సమభావము, సంతృప్తి, భగవదర్పితమైనమనసు, బుద్ధి, ఉద్వేగరాహిత్యము,శుచి, పవిత్రత, కార్యశీలత, సర్వకర్మఫలముల పట్ల అనాసక్తి, కోరికలు లేకుండుట,శుభాశుభకర్మలపై సమభావము, నిష్పాక్షికంగా ఉండుట, మానావమానముల యందు సమభావము, నివాసస్ధల మందు అనాసక్తి, మననశీలి, ధైర్యశాలి .... ఇట్టి లక్షణాలు కలిగిన భక్తులు భగవానునికి అత్యంత ప్రీతిపాత్రులు. ఎవరైతే ఈ ధర్మమార్గాన్ని అనుసరిస్తారో వారు నాకు అత్యంత ప్రియులు . వారు నిశ్చయంగా నన్నే చేరగలరు అని కృష్ణ పరమాత్మ తెలియజేసారు.
ఈ విధంగా శ్రీ కృష్ణ పరమాత్మ భక్తునికి ఉండవలసిన 39లక్షణాల గురించి అర్జునునికి, ఆయనను మాధ్యమంగా చేసుకుని సకలమానవాళి కి తెలియజేసారు .
వివేచకులు గీతాభిలాషులందరికి ఈఅధ్యాయపు వివేచన అందచేసే అవకాశాన్ని కల్గించిన భగవానునికి, గురుదేవులకి వందనములు అర్పించి, ప్రశ్నోత్తర కార్యక్రమమాన్ని మొదలుపెట్టారు.
ప్రశ్న 1:
ఒక వ్యక్తి మన ఎదురుగానే ఎన్నో పాపాలు చేస్తూ, మనకి కష్టం కలిగిస్తుంటే ఏం చెయ్యాలి?
జ. ఆ వ్యక్తి మన కుటుంబం లోనివాడే అయితే సహించాలి, వీలైతే మార్చడానికి ప్రయత్నం చేయాలి. బయట వ్యక్తి అయితే వారిపై క్రోధం చూపరాదు. చిన్న తప్పులయితే క్షమించగలగాలి.
ప్రశ్న 2:
గురువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
జ . పుస్తకాల వలన, యూ ట్యూబ్ చూడటం వలన దివ్య ఙ్ఞానము రాదు. సరైన మార్గం లో ఙ్ఞానాన్ని పొందాలంటే శాస్త్రపఠనం చేసిన గురువు వద్ద శిష్యరికం చేయాలి. ద్రోణుడు తనకి విలువిద్య నేర్పనని చెప్పినా నిరాశ పడకుండా ఏకలవ్యుడు ఆయన ప్రతిమను పెట్టి విలువిద్య నేర్చుకున్నాడు. కృష్ణ పరమాత్మని కొందరు తమ గురువు గా భావిస్తూ ఉంటారు.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం(య్ఁ)
యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే భక్తియోగో నామ ద్వాదశో౽ధ్యాయః
ఈ విధముగా ఓం తత్ సత్ అను భగవన్నామ ఉచ్చారణ పూర్వకమైన బ్రహ్మ విద్య మరియు యోగ శాస్త్ర మయమైన, శ్రీకృష్ణార్జునుల సంభాషణ లేక సంవాద రూపములో ఉన్న శ్రీమద్భగవద్గీతలోని పన్నిండవ అధ్యాయమైన భక్తియోగము సమాప్తమైనది