विवेचन सारांश
యోగత్వము-అష్టాంగ యోగ విధానము
జయ శ్రీకృష్ణ! జయ భరతమాత! జయ గీతా పరివార్!గురువులైన పరమ పూజ్య గోవింద్ దేవ్ గిరీ జీ మహారాజు గారి సూక్ష్మ ఉపస్థితిని మానసికంగా అనుభూతి పొందుతూ వారికి హృదయపూర్వక వందనం సమర్పిస్తూ గీతా సేవి కార్యక్రమమును ప్రారంభించారు. జ్ఞాన ప్రదాత, సరస్వతీమాతా పుట్టినరోజు నేడు. ఈ పవిత్రమైన వసంత పంచమి రోజు ఆధ్యాత్మిక విద్య అయిన భగవద్గీతా యందలి అధ్యాయముల వివేచన చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ భగవత్ప్రార్థన మరియు దీపప్రజ్వలనతో వివేచనా సత్రమునకు స్వాగతం పలికారు గీతాసేవి. ఈరోజు వివేచనాకర్త గీతా విశారదులు ఆదరణీయ శ్రీనివాస్ వర్ణేకర్ గారు. వారి గురువుగారికి వందనము సమర్పించి, భగవత్ప్రార్థన చేసి, గీతాసేవీలందరికీ అభివాదము చేస్తూ తన వివేచనను ప్రారంభించారు. ఈరోజు విషయము భగవద్గీతా యందలి ఆరవ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగము మధ్యాంశము. భగవద్గీతా యందలి 10వ అధ్యాయమైన విభూతి యోగము లోని 32వ శ్లోకములో పరమాత్మ "అధ్యాత్మవిద్యా విద్యానాం " అనగా విద్యలన్నింటిలోకి ఆధ్యాత్మిక విద్యను నేనై ఉన్నాను అని తెలియ జేయుచున్నారు. ఎట్టి విద్యనైనా అభ్యసించుటకు ఆత్మవిశ్వాసము, ఆత్మ నియంత్రణ, మరియు ఏకాగ్రత, ఆత్మ సంయమము అవసరము. ఈ విషయములకు సంబంధించిన అధ్యాయమే ప్రస్తుత అధ్యాయము ఆత్మ సంయమ యోగము. పరమాత్మ ఈ అధ్యాయము ద్వారా మానవుడు తన యొక్క శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి మరియు ఆహార, విహారాదులందు, నిద్ర యందు నియంత్రణ కలిగి ఉంటూ ఎటుల తనతో యోగమును కలిగి ఉండగలమో, ఆత్మ సంయమము ఎలా పొందగలమో దానికి ఏమేమి అవసరమో తెలియ జేయుచున్నాడు. మనము పూర్వ వివేచనలో కర్మ త్యాగము, కర్మయోగము లలో రెండూ శ్రేష్టమైనవే అని, సన్యాసి మరియు యోగి, వీరి ఇద్దరిలో బాహ్యంగా చూచుటకు వేషధారణలో వీరు వేరుగా కనబడినా, వారి యొక్క అంతరంగ స్థితి సమానముగా ఉండునని తెలుసు కున్నాము. అష్టాంగ యోగంలోని ఉన్నత స్థాయిలో ఉన్న ధ్యానము అనే అవస్థను చేరుటకు మొదట యోగారూఢుడు కావలెనని తెలుసుకున్నాము. యోగారూఢత్వము పొందవలెనంటే మొదట మానవుడు తన వంతు ప్రయత్నము చేయాలి. తన ప్రయత్నముతో ఇంద్రియ విషయముల యందు ఉత్సుకత లేకుండా కర్మల యందు అసక్తతసకలిగి ఉంటూ, కర్తవ్య రూపములో కర్మలంన్నింటిని చేస్తూ, మనసులో కలిగే సంకల్ప, వికల్పాలను నిర్జీవము చేస్తూ, "ఉద్దరేదాత్మనాత్మనాం", స్వయంగాస్వయంను, తనను తానే ఉద్ధరించుకోవాలి. ఈవిధముగా మానవుడు ప్రయత్నము చేసినా కూడా భగవత్కృప కూడా అవసరమే. మానవ ప్రయత్నము లేనిదే భగవత్కృప అందదు. భగవంతుని కృప లేనిదే ఏమీ జరగదు. సాధకుడు తన ప్రయత్నముతో మరియు భగవత్ కృపతో ఎప్పుడైతే యోగారూఢ స్థితిని చేరుతాడో అప్పుడు అతనికి ఏకాంతము యొక్క అవసరము ఉంటుంది. అప్పుడు అతడు ధ్యానమును సాధనముగా చేసుకోవాలి. ధ్యానము చేయగలిగిన స్థితిని పొందిన తర్వాత ధ్యానము చేయుటకు కూర్చోవడానికి స్థలము ఎలా ఉండాలో పరమాత్మ తెలియజేయు చున్నాడు.
6.11
శుచౌ దేశే ప్రతిష్ఠాప్య, స్థిరమాసనమాత్మనః৷
నాత్యుచ్ఛ్రితం(న్) నాతినీచం(ఞ్), చైలాజినకుశోత్తరమ్৷৷11৷৷
అంతర్జాలము బహుబాగుగా పని చేయును. అట్టి స్థానములో ఎక్కువగా ఎత్తు మీద కాక, అలాగే పల్లముగా లేకుండా చూసుకొని, ఒక చదునైన స్థలములో దర్భాసనము వేసి, దానిపై సహజముగా మరణము సంభవించిన జింక యొక్క చర్మమును ఉంచి, దానిపై ఒక ఖాదీ వస్త్రమును పరిచి ఆసనమును తయారు చేసుకోవాలని. అట్టి స్థలము
నిశ్శబ్దముగా, శాంతముగా ఉండాలి. ఎక్కువసేపు తృప్తితో, ప్రశాంతముగా కూర్చోగలిగే వాతావరణము కలిగి ఉండాలి. కాని ప్రస్తుత సమయములో మనము ధ్యానాభ్యాసము చేయాలంటే కూర్చున్న స్థలము శుభ్రముగా, ప్రశాంతముగా ఉండేలా చూసుకొని ,ఒక సాధారణ ఆసనము వేసుకున్నా సరిపోతుంది. యోగా చేయడము అనగానే, ఆసనములు మాత్రమే వేయడము అని అనుకుంటాము. పరమాత్మతో యోగత్వమును పొందుటకు ఆసనములు వేయడము మొదటి మెట్టు మాత్రమే. ఈ ఆసనముల అభ్యాసము వలన శరీరముపై నియంత్రణ కలుగును. మానవుని శరీరము అత్యంత స్థూలమైనది. దానికన్నా సూక్ష్మమైనవి ఇంద్రియములు వానికన్నా సూక్ష్మమైనవి మనసు మరియు బుద్ధి. మొదట స్థూలమైన శరీరము పైన నియంత్రణ రావాలి, దాని కోసము మనము ఆసనముల అభ్యాసము చేసి, ఆసన సిద్ధి పొందాలి. ఆసన సిద్ధి పొందిన తర్వాత ధ్యానానికి కూర్చోవాలి. ధ్యానాత్మకమైన ఆసనములు పద్మాసనము, స్వస్తికాసనము, గోముఖాసనము మొదలైనవి. ఈ విధముగా ధ్యానాభ్యాస క్రమము పరమాత్మ ఇంకనూ వివరించుచున్నారు.
తత్రైకాగ్రం(మ్) మనః(ఖ్) కృత్వా, యతచిత్తేన్ద్రియక్రియః৷
ఉపవిశ్యాసనే యుఞ్జ్యాద్, యోగమాత్మవిశుద్ధయే৷৷12৷৷
సమం(ఙ్)కాయశిరోగ్రీవం(న్), ధారయన్నచలం(మ్) స్థిరః৷
సమ్ప్రేక్ష్య నాసికాగ్రం(మ్) స్వం(న్), దిశశ్చానవలోకయన్৷৷13৷৷
ప్రశాన్తాత్మా విగతభీః(ర్), బ్రహ్మచారివ్రతే స్థితః৷
మనః(స్) సంయమ్య మచ్చిత్తో, యుక్త ఆసీత మత్పరః৷৷14৷৷
యుఞ్జన్నేవం(మ్) సదాత్మానం(య్ఁ), యోగీ నియతమానసః৷
శాన్తిం(న్) నిర్వాణపరమాం(మ్), మత్సంస్థామధిగచ్ఛతి৷৷15৷৷
నాత్యశ్నతస్తు యోగో౽స్తి, న చైకాన్తమనశ్నతః৷
న చాతిస్వప్నశీలస్య, జాగ్రతో నైవ చార్జున৷৷16৷৷
ద్వౌ భాగౌ పూరయేదన్నైః తోయే నైకం ప్రపూరయేత్
మారుతస్య ప్రచారార్థం చతుర్థమవశేషయేత్॥
కడుపులోని సగభాగమును అన్నాదుల చేతను, పాతిక భాగమును నీటి చేతను నింపి తక్కిన పాతిక భాగమును గాలి ఆడుటకు ఖాళీగా ఉంచవలెను. కడుపు నిండుగా భోజనము చేస్తే అస్వస్థత కలుగుతుంది. అస్వస్థతతో ధ్యానము చేయలేము. ఎవరైతే స్వయంలో స్థిరముగా ఉంటాడో, అతడు స్వస్థతను కలిగి ఉంటాడు. అనగా ఆత్మలో చిత్తమును ఉంచగలిగితే అదే స్వస్థత. అట్టి స్వస్థ శరీరము కోసం ఎట్టి ఆహారము స్వీకరించాలో పరమాత్మ తెలియజేయుచున్నాడు.
యుక్తాహారవిహారస్య, యుక్తచేష్టస్య కర్మసు৷
యుక్తస్వప్నావబోధస్య, యోగో భవతి దుఃఖహా৷৷17৷৷
చాలా ఎక్కువగా కార్యములను ఆచరిస్తే అతడు కర్మయోగి అనబడరు. చేసే పనికి ఒక ప్రమాణము ఉండాలి. నిద్ర, మెలుకువలు కూడా శరీరానికి సరిపడినంతగా ఒక ప్రమాణములో ఉండాలి. అనగా మితాహారము, మిత విహారము, మితకర్మ, మితనిద్ర, మితజాగరణ కలిగి ప్రవర్తించవలెను. దేని యందునూ మితమును తప్పరాదు. ఇట్టి అర్హతలు పొందినవాడు చేయు యోగము, అతనికి దుఃఖమును పోగొట్టును. ఈ విధముగా స్వయం తనపై నియంత్రణ కలిగి ఉన్నవాడు యోగాభ్యాసము చేస్తూ ధ్యానావస్థకు చేరితే అట్టి స్థితిలో గల సాధకుని యొక్క లక్షణముల గురించి పరమాత్మ తెలియజేయుచున్నాడు.
యదా వినియతం(ఞ్)చిత్తమ్, ఆత్మన్యేవావతిష్ఠతే৷
నిః స్పృహః(స్) సర్వకామేభ్యో, యుక్త ఇత్యుచ్యతే తదా৷৷18৷৷
యథా దీపో నివాతస్థో, నేఙ్గతే సోపమా స్మృతా৷
యోగినో యతచిత్తస్య, యుఞ్జతో యోగమాత్మనః৷৷19৷৷
యత్రోపరమతే చిత్తం(న్), నిరుద్ధం(య్ఁ) యోగసేవయా৷
యత్ర చైవాత్మనాత్మానం(మ్), పశ్యన్నాత్మని తుష్యతి৷৷20৷৷
సుఖమాత్యన్తికం(య్ఁ) యత్తద్, బుద్ధిగ్రాహ్యమతీన్ద్రియమ్৷
వేత్తి యత్ర న చైవాయం(మ్), స్థితశ్చలతి తత్త్వతః৷৷21৷৷
యం(ల్ఁ) లబ్ధ్వా చాపరం(ల్ఁ) లాభం(మ్), మన్యతే నాధికం(న్) తతః৷
యస్మిన్స్థితో న దుఃఖేన, గురుణాపి విచాల్యతే৷৷22৷৷
తం(వ్ఁ) విద్యాద్ దుఃఖసంయోగ, వియోగం(య్ఁ) యోగసఞ్జ్ఞితమ్৷
స నిశ్చయేన యోక్తవ్యో, యోగో౽నిర్విణ్ణచేతసా৷৷23৷৷
ప్రశ్నోత్తరములు
ప్రశ్న: భగవద్గీతా శ్లోకములు శుద్ధ ఉచ్చారణతో చదవడానికి ప్రయత్నిస్తున్నాను. కాని యోగాభ్యాసము చేయడము అనివార్యమా?
జవాబు: భగవద్గీతా శ్లోకములు నేర్చుకోవడానికి ఎలాంటి అర్హత అవసరము లేదు. అలాగే యోగాభ్యాసము చేయడానికి ఎలాంటి అర్హతలు అవసరం లేదు. అందరూ చేయవచ్చును. కాని ధ్యానము చేయుటకు మొదటి మెట్టు ఆసనసిద్ధి. అది యోగాభ్యాసము ద్వారానే సాధ్యపడును. ప్రతీ మానవుని యొక్క అంతిమ లక్ష్యము తన స్వ స్వరూపమును తెలుసుకొనుట. దానిని పొందుటకు ధ్యానము చేయాలి. ధ్యానము చేయుటకు మొదటి మెట్టు ఆసనసిద్ధి. అది యోగాభ్యాసము ద్వారానే సాధ్యపడును.
ప్రశ్న: యోగాభ్యాసము, ప్రాణాయామము రెండింటిలో ఏదో ఒకటి చేయవచ్చునా?
జవాబు. యోగాభ్యాసము చేయడము వలన శరీరము పై నియంత్రణ సాధ్యమగును. ప్రాణాయామము చేయడం వలన మనస్సుపై, చిత్తము పై నియంత్రణ కలుగును. తద్వారా అంతరంగ శుద్ధి జరుగును. యోగాభ్యాసము ద్వారానే ఆసనసిద్ధి కలుగుతుంది. ఆసనసిద్ధి కలగనిదే ప్రాణాయామము చేయలేము. అందువలన ఆసనములు వేయడము మరియు ప్రాణాయామము వరుసగా చేస్తూ వెళుతూ ఉంటే ప్రత్యాహార స్థితికి చేరుతాము. అనగా ఇంద్రియాలు బాహ్య విషయాలను వదిలి అంతర్ముఖ మగును. తద్వారా యోగము పొందగలము.
ప్రశ్న. అష్టాంగయోగము ఆచరించడము చాలా కఠినము. అందువలన భక్తి మార్గములో వెళితే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారములను భగవంతుని యందే పెడితే సరిపోతుంది అంటారు కదా మరి! యోగాభ్యాసము అవసరమా?
జవాబు: భక్తిని పెంపొందించుకోవడానికే ఈ ఉపాయములన్నీ. మనస్సు, బుద్ధిని భగవంతునిపై పెట్టండి అనగానే అవి ఏమన్నా పూలు కాని, పండ్లు కాని, గంధము కాని కాదు కదా! సమర్పించాను అని అనటానికి. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము లను భగవంతునిపై ఉంచడానికి ఈ యోగాభ్యాసము, ప్రాణాయామము, ప్రత్యాహార సాధనలు. అందువలన భగవద్గీతాలో చెప్పబడిన సాధనములు అన్నింటిని చేస్తూ వెళ్లాలి. యోగాభ్యాసము రోజులో ఒక గంట చేయగలము. మరి మిగతా సమయములో మన కర్తవ్య కర్మలను పరమాత్మ కోసం చేస్తున్నాను అన్న భావనతో అర్పిస్తూ వెళితే, చిత్తము భగవంతుని యందే ఉండును. ఏదో విధముగా కర్మలు చేస్తూనే చిత్తమును భగవంతునితో కూడి ఉంచుతూ ఉంచాలి. ఇదే భగవద్భక్తి.
ప్రశ్న : ధ్యానానికి కూర్చున్నప్పుడు ప్రశాంతముగా ఉంటూ నాసికాగ్రముపై దృష్టి ఉంచాలి అన్నారు కదా! మరి బీజమంత్ర ఉచ్ఛారణ ఉదాహరణకు ఓం నామమును కూడా జపించవచ్చునా?
జవాబు. నామ జపము కూడా ధ్యానము కుదురుట కోసమే చేయుదుము. ఈ మంత్ర జపములో కూడా రకములు కలవు. మొట్టమొదటగా నామమును బయటకి దగ్గరగా ఉచ్చరించుట, తదనంతరం శబ్దం రాకుండా పెదవులతో కదులుతూ, కేవలం పెదవులు మాత్రమే కదులుతూ చేసే జపము.తర్వాత మనసునందే జపము చేయుట మొదలైనని జపములోని రకములు. ఇవన్నీ యోగత్వమును పొందుటకు సాధనములే. ఒకవేళ ఓంకార జపము చేస్తూ ఉంటే మనసు లయమైనచో ఆ ఓంకార జపం చేయవచ్చును. భ్రూమధ్యలో ఓంకార ప్రతిమను స్థాపించి, ధ్యానము చేస్తే మనసు, బుద్ధి దాని యందే ఏకీకృతమవుతే మిగతావన్నీ వదిలిపోవును..
ప్రశ్న: పరమాత్మ అంతటా అణువణువు నందు ఉన్నాడు కదా మరి! ధ్యానమునందు భగవంతుని స్వరూపముపై దృష్టి కేంద్రీకరించాలి అంటే ఏ స్వరూపము పై కేంద్రీకరించాలి?
జవాబు: అంతటా నిండి ఉన్న నిరాకార పరబ్రహ్మమును మనము ఏ రూపములో పూజించగలము? కాబట్టి మన ఇష్ట దైవము మూర్తి స్వరూపములో ధ్యానము చేయాలి.
ప్రశ్న: ధ్యానము నందు ఓంకారమును ఉచ్చరిస్తే ఏమైనా లాభము ఉంటుందా?
జవాబు: ఓంకార జపము చేస్తే భగవంతుడిని తన నామముతో పిలిచినట్టే. ఓంకారమును భగవంతుని నామముగా అంగీకరించారు పెద్దలు. ఏదైనా కార్యమును ఓం అంటూ ప్రారంభిస్తూ, తత్ అంటూ పరమాత్మ కోసం చేస్తున్నాననే భావముతో చేస్తూ, సత్ అంటూ పరమాత్మకు అర్పణ చేస్తూ ఆచరిస్తే ఆ కార్యము సత్కార్యము అగును. ఈ విధముగా ఓంకారమును వినియోగిస్తారు.
మరొక విధానము:
ఓంకారమును జపము చేయడము అంటే, నాదానుసంధానము చేయడము అంటారు. ఓంకారము యొక్క నాదముతో అనుసంధానమవడం. ఆ నామ జపము వలన కలిగే ప్రకంపనల వలన శరీరము, మనసు, చిత్తము స్థిరమవును.. తద్వారా చిత్తమును ఏకాగ్రము చేయగలము. కాని ఓంకార జపమునకు నియమములు కలవు. మహిళలు ఓంకార జపము చేయకూడదు అనే నియమము కలదు. కాబట్టి గురువుల మార్గదర్శనములో ఓంకార సాధన చేయాలి