विवेचन सारांश
ఏ పని చేసినా శ్రద్ధ, భక్తి, విశ్వాసం, పద్ధతి పాటించి చెయ్యాలి.
జ్యోతి ప్రజ్వలనము, గురువందనము చేసిన తరువాత శ్రీమతి శృతి నాయక్ గారు శ్రద్ధా త్రయ విభాగ యోగమైన 17వ అధ్యాయం రెండవ/చివర భాగమును పిల్లలకు వివరించడం మొదలుపెట్టారు.
17 వ అధ్యాయం మొదటి భాగములో 10 శ్లోకముల అర్ధము నేర్చుకున్నాము. శ్రద్ధ అనేది మూడు రకములు వుంటుందని, అవి సాత్విక, రాజసిక, తామసిక శ్రద్ధలు అని, అవి మనలో మన పూర్వజన్మ ఫలితములను బట్టి ప్రకృతి ద్వారా మన స్వాభావిక గుణములుగా వుంటాయని, మనము ఈ జన్మలో చేసే పనులను బట్టి వాటిని పెంచుకోవడము, తగ్గించుకోవడము చేయగలమని, అందులో మనం సాత్విక గుణమును పెంచుకుని, మిగిలిన రెండిటినీ సాధన ద్వారా తగ్గించుకోవాలని నేర్చుకున్నాము కదా?
సాత్విక స్వభావము వున్నవారు ఆహారము చక్కగా ఆరోగ్యకరంగా వుంటుందని, రాజసిక స్వభావము వారు కారము, ఉప్పు వంటివి ఎక్కువగా వుండి ఎమోషన్స్ ఎక్కువగా చేసేవిగా వుంటాయని, తామసిక స్వభావము కలవారు పాచిపోయిన ఆహారం, నూనెలో వేయించిన వస్తువులు వంటివి ఎక్కువగా వుండి మన బుద్ధిని మందగింపచేస్తాయని నేర్చుకున్నాము కదా! అంటే ఎటువంటి అన్నము తింటామో మన ఆలోచనలు, ప్రవర్తన, ఆరోగ్యం ఆ విధంగానే వుంటాయి. రాజసిక, తామసిక అస్సలు తినకూడదు అనికాదు, ఎప్పుడూ వాటినే తినడం కాకుండా చాలా మితంగా అవి తింటూ ఎక్కువగా సాత్విక పదార్ధాలను భగవానుని ప్రసాదంగా భావించి తినాలని మనం తెలుసుకున్నాము.
రాజసిక యజ్ఞం. ఇది కూడా మంచి పని చెయ్యడమే. కాని ఏ పనిలోనైనా ఏ ఉద్దేశ్యంతో ఏమి కోరుకుని ఆ పని చేస్తున్నామో దానిని బట్టి అది సాత్వికమా ? రాజసికమా? తామాసికమా అని తెలుస్తుంది.
మళ్ళా అమ్మ వంటగురించి చూసుకుంటే.. అమ్మ ఎక్కడైనా "ఈరోజు ఎక్కువ కారం వేద్దాము కూరలో, పాపకి కారం వేసి మంచిపని అవుతుంది." అని అనుకుంటుందా ? లేదు కదా.. పాపకు చక్కగా ఆరోగ్యంగా ఉండాలనే చేస్తుంది. నేను ఈవేళ వివేచన చెయ్యడానికి వచ్చాను. నేను చక్కగా మీ అందరికీ ఇది explain చెప్పాలని ప్రిపేర్ అయ్యి వచ్చాను. అదే "ఓ! నేను ఈ వివేచన చెప్తే నాకు అందరూ క్లాప్స్ కొడతారు." అని గొప్పగా వస్తే అది రాజశికం అవుతుంది. అంటే నేను చేసే పని ఒక ఫలితం ఆశించి చేస్తే, నా గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి అన్న గర్వం తో చేస్తే, అందులో శ్రద్ధ వున్నాకూడా అది రాజసికం.

అందరి మంచి కోసం చేసే పని ఏదైనా సరే అది యజ్ఞం. యజ్ఞమనేది నిష్టగా ఫోకస్ తో సిన్సియర్ గా చెయ్యాలి. టీచర్ క్లాస్ లో టీచ్ చెయ్యడం, అమ్మ ఇంట్లో పిల్లలకోసం భోజనం ప్రిపేర్ చెయ్యడం, నాన్న పిల్లలందరినీ చక్కగా పోషించడం, పిల్లలు తల్లిదండ్రుల మాట విని చక్కగా చదువుకుని పరీక్షలు రాసి మంచిగా behave చెయ్యడం, పురోహితులు గుడిలో మంచిగా పూజ చెయ్యడం, మన ప్రధాని చక్కగా న్యాయంగా రాజ్యపాలన చెయ్యడం, ఇవన్నీ కూడా యజ్ఞములాంటివే. ఏ పని చేసినా మనసుపెట్టి నిష్టగా చెయ్యాలి. దాని వలన మనకు ఏమి ఫలితము వస్తుందని ఆలోచిస్తూ కూర్చోకుండా, మనకు ఇచ్చిన పనిని చెయ్యాలి. ఎవరో మనకు థాంక్స్ చెప్తారు, మెచ్చుకుంటారు అని అమ్మ పిల్లలకు వంట వండదు కదా? అందరూ చక్కగా ఆకలి తీరేటట్టుగా భోజనం చేసి ఆరోగ్యంగా వుండాలనే ఉద్దేశ్యంతో చేస్తుంది. ఈ విధంగా ఫలితం ఆశించకుండా, సింపుల్ గా, ఆనందంగా చేసేదానిని సాత్విక యజ్ఞము అంటాము.
ఏ పని చేసినా శాస్త్రములో చెప్పిన పద్దతిలో చేసుకోవాలని మనం నేర్చుకున్నాము. ఎవరైతే అటువంటి శాస్త్ర పద్ధతిలో పని చెయ్యరో, ఫలితం త్వరగా వచ్చేయాలని shortcuts చూసుకుని ఏదోవిధంగా పని చేసేద్దామని చేసేస్తారో, ఉదాహరణకు చేసుకునే గణేశ పూజను శాస్త్రీయ పద్ధతిలో కాకుండా హడావిడిగా ఒక 10 నిముషాలలో చేసేసి వెళ్లి సినిమా చూద్దాం అన్నట్టుగా చేస్తారో వారు తామసిక స్వభావం వున్నారని అర్ధం. దానివలన సరైన ఫలితము దొరకదు, అట్టివారు భగవానుని పొందలేరు.

ఇప్పుడు ఈ రెండవ భాగములోని శ్లోకాల ద్వారా మనం తపస్సు ఎన్ని రకాలు, ఈ మూడు స్వభావములగలవారు ఆ తపస్సులను ఎలాగ నిర్వహిస్తారు, ఏది మంచిది అనేవి నేర్చుకుందాము. ప్రతి వ్యక్తి చేసే మంచి పనులూ, అవి నిష్కామంగా వుండి అందరి మంచి కోసం చేసుకుంటే అది తపస్సు క్రిందికే వస్తుంది.
17.14
దేవద్విజగురుప్రాజ్ఞ, పూజనం(మ్) శౌచమార్జవమ్
బ్రహ్మచర్యమహింసా చ, శారీరం(న్) తప ఉచ్యతే।।14।।
దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించుట, పవిత్రత(శౌచము) నిరాడంబరత్వము, అహింస అనునవి శారీరక తపస్సులు.
తపస్సులు 3 రకములు: శరీరముతో చేసేవి శారీరక తపస్సులు. నోటిమాట తో చేసేది వాచక్ తపస్సు, మనస్సుతో చేసేది మానసిక తపస్సు.
మనం రోజూ చేసే పూజ దేవతలకు చేస్తాము. విష్ణుభగవానుని అవతార దేవతలకు, శివునికి, వినాయకునికి, దేవికి, సూర్యభగవానునికి పూజ చేసుకుంటాము. పొద్దున్నే లేచి సూర్యభగవానునికి పూజ చేసుకుని మన రోజు ప్రారంభిస్తే మనకు ఎంతో ఆరోగ్యం కలుగుతుంది. పొద్దున్నే వచ్చే సూర్యకిరణాలలో చక్కగా విటమిన్ D వుంటుంది. అదేవిధంగా బ్రాహ్మణులకు, గురువులకు, అమ్మ నాన్నలకు పూజ చెయ్యాలి. అమ్మ మనకు మొదటి గురువు అని చెప్తారు పెద్దలు. ఈవేళనుండి మీరంతా చక్కగా పొద్దున్న లేవగానే అమ్మ, నాన్న పాదాలకు దణ్ణం పెట్టి. పెద్దలకు మన్ననలను అందించి రోజు ప్రారంభిస్తే అంతా మంచి జరుగుతుంది. ఈ పూజలన్నీ కూడా శారీరకంగా చేసేవి. అందువలన మనం ఎప్పుడూ మన శరీరాన్ని శుభ్రంగా వుంచుకోవాలి. అదేవిధంగా పూజలు చక్కగా సింపుల్ గా చేసుకోవాలి. ఆర్జవం, బ్రహ్మచర్యం మొదలైనవి చాలా ముఖ్యమైన తపస్సు విధానములు.

అనుద్వేగకరం(వ్ఁ) వాక్యం(మ్), సత్యం(మ్) ప్రియహితం(ఞ్) చ యత్
స్వాధ్యాయాభ్యసనం(ఞ్) చైవ, వాఙ్మయం(న్) తప ఉచ్యతే।।15।।
ఉద్వేగమును కలిగింపనిదియు, ప్రియమైనదియు, హితమును గూర్చునదియు, యథార్థమైనదియు అగు భాషణము, అట్లే వేదశాస్త్రపఠనము, పరమేశ్వరుని నామజప సాధన మొదలగునవి యన్నియును వాక్కునకు సంబంధించిన తపస్సులు.
ఈ శ్లోకములో వాచిక తపస్సు గురించి తెలుసుకుందాము.
మనము మాట్లాడేటప్పుడు మృదువుగా ఉండాలి. మనం మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడాలి, సత్యమే చెప్పాలి కాని అది అవతలివారికి నష్టం కలిగించేదిగా వుండకూడదు. ఉదాహరణకు ఒకరు లావుగా వున్నారనుకోండి, వారిదగ్గర "నువ్వు లావుగా వున్నావు" అని అది నిజమైనా కానీ చెప్పకూడదు కదా, ఎందుకంటే వారికి బాధ కలుగుతుంది. మన tone లో ఎప్పుడూ ఆప్యాయత, సౌమ్యత్వం వుండాలి. అప్పుడు అందరూ మనతో మాట్లాడటానికి సంతోషిస్తారు కూడా. మన మాటలద్వారా ఎవరైనా ఏదైనా సంతోషం పొందినా, నేర్చుకున్నా మనకు కూడా అది బాగా అనిపిస్తుంది కదా. ఎటువంటి ఉద్వేగం లేకుండా అవతలివారు ఉద్వేగ పడకుండా మాట్లాడాలి. ఒకసారి ఒక మాట అనేస్తే ఇంక దానిని వెనుకకు తీసుకోలేమన్న సంగతి బాగా గుర్తువుంచుకోవాలి. మహానుభావుల గురించి చక్కగా మాట్లాడుకోవాలి.

మనః(ఫ్)ప్రసాదః(స్) సౌమ్యత్వం(మ్), మౌనమాత్మవినిగ్రహః
భావసంశుద్ధిరిత్యేతత్, తపో మానసముచ్యతే।।16।।
మనఃప్రసన్నత, శాంతస్వభావము, భగవచ్చింతన, మనోనిగ్రహము, అంతఃకరణశుద్ధి మొదలగునవి యన్నియును మానసికతపస్సులు.
ఈ శ్లోకములో మానసిక తపస్సు గురించి తెలుసుకుందాము.
మనము మాట్లాడే మాటలే కాదు, మన మనసులోని భావాలూ కూడా స్వచ్ఛంగా ఉండాలి. మన ఆలోచన అవతలివారికి తెలియదు కదా అని మనం ఎవరిగురించీ తప్పుగా ఆలోచించకూడదు. మనసులో చెడుభావం పెట్టుకుని బయటికి కొందరు నవ్వుతూ మాట్లాడుతారు. అది చాలా తప్పు. ఎప్పుడైతే మన ఆలోచనలు, మనస్సు క్లీన్ గా వుంటాయో, అప్పుడు మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఎలాగైతే భగవానునికి నైవేద్యం పెట్టినప్పుడు దేవుడు అది bless చేసి ఇస్తే మనకు అది మంచి ప్రసాదం అవుతుందో, అలాగే మన మనసు కూడా మంచిగా ఉంచుకుని దేవునికి అర్పించుకోవాలి. అప్పుడు మనకు ప్రసన్నత, శాంతి, శ్రద్ధ, భక్తి, సంతోషం కలుగుతాయి.
కొందరు ఎప్పుడూ ఎవరితో దెబ్బలాటపెట్టుకుందామా అని చూస్తూ వుంటారు. కొందరు ఎప్పుడూ కోపంగా వుండి, ఎవరు ఏమి మాట్లాడినా వారితో గట్టిగ పోట్లాడినట్టుగా మాట్లాడుతారు. అలాగ చేస్తే మనకు ఎవరూ ఫ్రెండ్స్ వుండరు, కదా?
ఒక్కొక్కసారి మౌనంగా వుండి భగవానుని చింతనలో వుంటే అది మనకు చాలా బాగుంటుంది. ఒక నిముషం కళ్ళుమూసుకుని చూడండి, మీకు ఎన్నో ఆలోచనలు వచ్చేస్తాయి. అలాగ కాకుండా కళ్ళుమూసుకుని మనసును ఒక దానిమీద, ఉదాహరణకు భగవాన్ మీద ఫోకస్ చేసి చూడండి, అది మన అంతఃకరణాన్ని శుద్ధి చేస్తుంది. మనసును మన శరీరం క్లీన్ చేసుకున్నట్టు సబ్బుతో క్లీన్ చెయ్యలేముకదా!!
చక్కగా స్నానం చేసాక కొంచంసేపు దేవుని శుద్ధి గా ధ్యానం చేసుకుంటే మన మనస్సు శుభ్రం అవుతుంది. అంతేకానీ దేవుడి గదిలో కూర్చుని ఏవో నోటితో పూజ చేస్తూ మంత్రం చదువుతున్నా, మనస్సులో స్థిరత్వం లేకపోతే అది పనికిరాదు. పుస్తకం ముందు పెట్టుకుని "నాన్నగారు ఇంటికి ఎప్పుడు వస్తారో, వచ్చేటప్పుడు నాకు ఏమి స్వీట్స్, బొమ్మలు తెస్తారో" అని ఆలోచిస్తూ వుంటే మనకు ఆ పుస్తకంలో వున్న విషయం బుర్రకి ఎక్కదు కదా/ అలాగేనన్నమాట. చిన్నప్పటినుండే ఇటువంటి మంచి గుణములు నేర్చుకుని continuous గా ప్రాక్టీస్ చేస్తూ వుంటే మనకు అది ఆటోమేటిక్ గా అలవాటు అయిపోతుంది. పెద్ద అయ్యాక కూడా మన మంచిగుణం మనతోనే ఉంటుంది. అదే "తపస్సు".

శ్రద్ధయా పరయా తప్తం(న్), తపస్తత్త్రివిధం(న్) నరైః
అఫలాకాఙ్క్షిభిర్యుక్తైః(స్), సాత్త్వికం(మ్) పరిచక్షతే।।17।।
పూర్వోక్తములైన (శారీరిక, వాచిక, మానసిక) తపస్సులను ఫలాకాంక్షలేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని ‘సాత్త్విక తపస్సులు’ అని యందురు.
ఇక్కడ మనం చెప్పుకున్న మూడు రకాల తపస్సులూ మనం నేర్చుకున్న మూడు రకముల గుణములతో (సాత్విక, రాజసిక, తామసిక) కలుస్తాయో చెప్పుకుందాము. మనము ఏదైతే శారీరిక, వాచిక, మానసిక తపస్సు అని చెప్పుకున్నామో, అవి శ్రద్ధతో, ఏ ప్రతిఫలము ఆశించకుండా చేస్తే అదే "సాత్విక తపస్సు.". ఇప్పుడూ అందరితో మంచిగా మెసలుతూ, మంచిమాటలు మాట్లాడుతూ, మనసులో కూడా స్నేహభావంగానే వుండడం.
సత్కారమానపూజార్థం(న్), తపో దమ్భేన చైవ యత్
క్రియతే తదిహ ప్రోక్తం(మ్), రాజసం(ఞ్) చలమధ్రువమ్।।18।।
ఇతరులనుండి సత్కారములను, గౌరవములను, పూజలను అందుకొనుటకును, అట్లే తదితర స్వార్థ ప్రయోజనముల కొఱకును, స్వాభావికముగాగాని, కల్పితముగా గాని చేయబడునవియు, అనిశ్చితఫలములను గాని, క్షణికఫలములనుగాని ఇచ్చునవియు ఐన తపస్సులను ‘రాజసతపస్సులు’ అని యందురు.
అలాగే, మనం చేసే ఆ తపస్సు ఎవరో మనను మెచ్చుకుంటారు అనో, మనకు ఏవో కానుకలు ఇస్తారనో, మనకు మాత్రమే మంచి కలగాలనో చేస్తే అది రాజసిక తపస్సు. ఎప్పుడూ గొప్పలు చెప్పుకోవడం, గొప్పగా పనులు చేస్తూ వుండడం, మనసులో కూడా అవతలివారికంటే తామే గొప్పవాళ్ళం అనుకోవడం వంటివన్నమాట.
మూఢగ్రాహేణాత్మనో యత్, పీడయా క్రియతే తపః
పరస్యోత్సాదనార్థం(వ్ఁ) వా, తత్తామసముదాహృతమ్।।19।।
మొండిపట్టుదలతో మనోవాక్కాయములకు బాధకలిగించునవియు, ఇతరులకు కీడు కల్గించుటకై చేయబడునవియు, ఐన తపస్సులను ‘తామసతపస్సులు’ అనియందురు.
అదే తపస్సును ఇంకొకరికి నష్టం కలిగించాలని చేస్తే అది తామసిక తపస్సుగా చెప్తారు. ఇంకొకరి వైపు అసహ్యపడుతూ చూడటం (శరీరంతో చేసే పని), వారిని కించపరుస్తూ తక్కువచేసి మాట్లాడటం (వాక్కు/మాట తో చేసేపని), పైకి గొప్పగా మాట్లాడినా మనసులో వారిని చులకనగా అనుకోవడం వంటివి.
దాతవ్యమితి యద్దానం(న్), దీయతే౽నుపకారిణే
దేశే కాలే చ పాత్రే చ, తద్దానం(మ్) సాత్త్వికం(మ్) స్మృతమ్।।20।।
‘దానము చేయుటయే కర్తవ్యము’ అనుభావముతో తగిన ప్రదేశముల యందును, దుర్భిక్షాదికాలముల యందును, ఆకలిదప్పులతో బాధపడువారు, అంగవైకల్యముగలవారు, రోగులు మొదలగువారికిని, బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలగు పాత్రులైనవారికిని ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్థభావముతో చేయబడు దానము ‘సాత్త్వికదానము’అనబడును.
ఇప్పుడు దానములు ఎలాగ మూడురకములో, సాత్విక, రాజసిక, తామసిక స్వభావం వున్నవారు దానం ఏ విధంగా ఆలోచిస్తూ చేస్తారో తెలుసుకుందాము.
దానం అంటే ఇవ్వడం. ఎవరికి ఇవ్వడం? ఏమిటి ఇవ్వడం? అంటే, మనకు భగవానుడు ఇచ్చిన మంచి భాగ్యాన్ని మనం అది ఎవరికి అవసరమో వారికి ఇవ్వడం అనేది దానము. ఉదాహరణకు ఇల్లులేనివారు రోడ్డు ప్రక్కన ఒక పూరిగుడిసెలో వుంటారు, వారికి చాలా చలిగా వుంది అనుకోండి. వారికి వెచ్చగా వుండేటట్టుగా, చలి తట్టుకొనే విధంగా ఒక బ్లాంకెట్ ఇవ్వడం అనేది మంచి దానం.
దానం ఇచ్చాక అది మరలా తీసుకోవడం కాని, మనం ఇచ్చినదానికి బదులుగా వారినుండి మరేదైనా తీసుకోవడం గాని సరైన దానం అనిపించుకోదు. మనం ఒక వస్తువును దానం చేసాక ఇంక దానితో మనకు సంబంధం వుండకూడదు. అది సాత్విక దానము.

యత్తు ప్రత్యుపకారార్థం(మ్), ఫలముద్దిశ్య వా పునః
దీయతే చ పరిక్లిష్టం(న్), తద్దానం(మ్) రాజసం(మ్) స్మృతమ్।।21।।
కాని ప్రత్యుపకారమును ఆశించిగాని, ప్రతిఫలాపేక్షతో గాని వివిధములగు ఒత్తిడులకు లోనైగాని బాధపడుచు విధిలేక ఇచ్చు దానమును ‘రాజసదానము’ అనియందురు.
ప్రతిఫలం ఆశించో, గొప్పగా మనగురించి చెప్పుకుంటారు లేకపోతే మనగురించి మంచిగా పేపర్ లో వేస్తారు లేదా టీవిలో చూపిస్తారు అన్న ఆశతో చేసే దానం రాజసిక దానం అనిపించుకుంటుంది.
అదేశకాలే యద్దానమ్,అపాత్రేభ్యశ్చ దీయతే ৷
అసత్కృతమవజ్ఞాతం(న్), తత్తామసముదాహృతమ్৷৷22৷৷
సద్భావము లేకుండా, దానము పుచ్చుకొనువారి యెడల గౌరవాదరములను చూపక, తృణీకార భావములతో ఛీకొట్టుచు, అయోగ్యులకును, అపాత్రులకును చేయబడు దానమూ, దేశకాలో చితము కాని దానమూ, ‘తామసదానము’ అని యనబడును.
ఎవరికైనా ఇచ్చే వస్తువును వారిమీద అసహ్యంతోనో, "అబ్బా! ఎందుకు ఇచ్చేనా?" అన్న రిగ్రెట్ తో కాని ఇచ్చేది తామసిక దానము. పాడు అయిపోయిన వస్తువులనో, చిరిగిపోయిన బట్టలనో ఇస్తే అది కూడా తమాసికమే. ఎవరూ ఈ విధంగా దానం చెయ్యకూడదు.
ఓం తత్సదితి నిర్దేశో, బ్రహ్మణస్త్రివిధః(స్) స్మృతః
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ, యజ్ఞాశ్చ విహితాః(ఫ్) పురా।।23।।
ఓమ్, తత్, సత్ అని మూడు విధములగు పేర్లు సచ్చిదానందఘన పరబ్రహ్మకు నిర్దేశించబడినవి. ఆ పరమాత్మనుండియే సృష్ట్యాదియందు బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు ఏర్పడుట జరిగినది.
మనందరికీ ఎలాగ అమ్మ,నాన్న పెట్టిన పేర్లు ఉన్నాయో అలాగే భగవానుడికి కూడా చాలా పేర్లు వున్నాయి. అందులో ఓం, తత్, సత్ అనేవి పరమాత్మ పేర్లు. మనము ఏమి పూజ చేసినా "ఓం!" అనే పేరుతో ప్రారంభిస్తున్నాము కదా! ఓం అనగానే మనం భగవానుని పిలుస్తున్నట్టు. ఆయనతో కనెక్ట్ అయిపోతాము. ఓం అనేది ప్రణవ స్వరూపం. ఇది అ + ఉ + మ్ అనే మూడక్షరాల కలయిక.
తత్ అంటే "ఆ" అని అర్ధం. సత్ అంటే "సత్యము" అని అర్ధము. ఎప్పుడూ వుండేవాడు అని అర్ధం. మనం మంచి అనే విశేషణం చెప్పాలంటే సత్ అనే పదం వాడతాము. సచ్చిదానంద అంటాము కదా, అది సత్+చిత్ +ఆనంద అని, సత్పురుషులు అంటే మంచి వారు (సత్ + పురుషులు).

తస్మాదోమిత్యుదాహృత్య, యజ్ఞదానతపః(ఖ్)క్రియాః
ప్రవర్తన్తే విధానోక్తాః(స్), సతతం(మ్) బ్రహ్మవాదినామ్।।24।।
కనుక వేదమంత్రములను పఠించువారు శాస్త్ర విహితములైన యజ్ఞదాన తపశ్చర్యలను సర్వదా ‘ఓమ్’ అను పరమాత్మనామమును ఉచ్చరించుచునే ప్రారంభింతురు.
ఈ క్రింది మూడు శ్లోకాలలో పరమాత్మ మూడు పేర్లను ఎలాగ వాడతారో తెలుసుకుందాము.
"ఓమ్" అనే పేరును శాస్త్ర ప్రకారంగా చేసే అన్ని పనులలోనూ, వేదాలు చదివేటప్పుడు వాడుతారు.

తదిత్యనభిసన్ధాయ, ఫలం(య్ఁ) యజ్ఞతపః(ఖ్)క్రియాః
దానక్రియాశ్చ వివిధాః(ఖ్), క్రియన్తే మోక్షకాఙ్క్షిభిః।।25।।
మోక్షకాంక్షగలవారు స్వలాభాపేక్ష లేశమాత్రమైనను లేకుండ లోకహితార్థమై యజ్ఞదానతపశ్చర్యలను ‘ఇదియంతయును పరమాత్మదే’ అను భావముతో ‘తత్’ అను నామమును ఉచ్చరించుచు చేయుదురు.
"తత్" అనే పేరును మనం చేసే పని ఆ పరమాత్మ చెప్పినది, దాని ఫలితం ఆ పరమాత్మకే చెందాలి అన్నప్పుడు వాడుతాము.
సద్భావే సాధుభావే చ, సదిత్యేతత్ప్రయుజ్యతే
ప్రశస్తే కర్మణి తథా, సచ్ఛబ్దః(ఫ్) పార్థ యుజ్యతే।।26।।
ఓ పార్థా! ‘సత్’ అను పరమాత్మనామము సత్యభావమునందును, శ్రేష్ఠభావమునందును అనగా పరమాత్ముడు నిత్యుడు, శ్రేష్ఠుడు అను భావము నందును ప్రయోగింపబడుచుండును. ఉత్తమకర్మాచరణము నందును ‘సత్’ అను శబ్దము ప్రయుక్తమగుచుండును.
"సత్" అనే పేరును ఎప్పుడూ కూడా పరమాత్మ అన్నిటికన్నా గొప్పవాడు, అందువలన మనకు అన్నీ మంచిగా, అంటే మంచి బుద్ధి (సద్బుద్ధి), మంచి జ్ఞానం (సత్ జ్ఞానం), మంచి విద్య (సద్విద్య ) వంటివి కావాలని కోరుకునేటప్పుడు వాడుతాము.
యజ్ఞే తపసి దానే చ, స్థితిః(స్) సదితి చోచ్యతే
కర్మ చైవ తదర్థీయం(మ్), సదిత్యేవాభిధీయతే।।27।।
యజ్ఞదానతపఃక్రియలయందలి నిష్ఠ, ఆస్తిక, భావమును ‘సత్’ అనియందురు. పరమాత్మను ఉద్దేశించి, చేయబడు నిశ్చయాత్మక కర్మలనుగూడ ‘సత్’ అని యందురు.
యజ్ఞ, తపస్సు, దానము అనేవి ఎప్పుడైతే మనము ముందు నేర్చుకున్నట్టుగా సాత్విక స్వభావం తో చేస్తామో అటువంటి పనులను "సత్" కర్మలు అంటారు.
అశ్రద్ధయా హుతం(న్) దత్తం(న్), తపస్తప్తం(ఙ్) కృతం(ఞ్) చ యత్
అసదిత్యుచ్యతే పార్థ,న చ తత్ప్రేత్య నో ఇహ।। 28 ।।
ఓ అర్జునా! శ్రద్ధ (విశ్వాసము) లేకుండ చేయబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకను జరుపబడు ఇతర శుభకర్మ లన్నియును, ‘అసత్’ అని చెప్పబడును. దానివలన జీవించియుండగా గాని మరణించిన పిదపగాని ఎట్టి ప్రయోజనమూ కలుగదు.
శ్రద్ధ, నిష్ఠ, భక్తి,, విశ్వాసము, శాస్త్రము లేకుండా చేసే పనులు రాజసిక, తామసిక స్వభావంతో చేసేవి అని తెలుసుకున్నాము కదా. అందుచేత ఆ పనులు మంచిపనులే అయినా అవి "అసత్ " కార్యములు అని చెప్పబడతాయి.
"అటువంటి పనులు చెయ్యడం వలన అర్జునా, అవి చేసేవారికి ఈ లోకంలోనూ మంచి ఫలితము వుండదు, మరణించిన తరువాత కూడా దానినుండి ఏమీ పుణ్యము వారితో వెన్నంటి ఉండదు. " అని భగవానులు అర్జునునికి ఈ అధ్యాయములో చెప్పారు.
అందువలన పిల్లలూ, మనము ఈ అధ్యాయము నుండి ఏమి నేర్చుకున్నాము? ఏ పనిని చేసినా, అది ఎంత చిన్నదైనా, పెద్దదైనా, శ్రద్ధతో, భక్తితో, విశ్వాసంతో, పెద్దలు ఆ పనిని ఎలాగ చెయ్యాలని చెప్పారో అలాగే చెయ్యాలి. అప్పుడే మనము భగవానునికి ఇష్టమైన పని చేసినట్టు. మీరు ఆల్రెడీ ఒక సత్కార్యాన్ని చేస్తున్నారు, అదేమిటంటే గీతా పఠనం. గీతా సారాన్ని తెలుసుకుని అందులో భగవానుడు చెప్పిన రీతిగా మనందరమూ ప్రవర్తించి పరమాత్మకు ప్రీతిపాత్రులము అవుదాము. సరేనా?
ఈ విధంగా చక్కగా ఈ శ్రద్దాత్రయ విభాగ యోగమును పిల్లలకు వివరించి చెప్పి, శ్రీమతి శృతి నాయక్ గారు పిల్లలకు ఏమైనా ప్రశ్నలున్నాయేమో అడిగి వాటికి సమాధానములు చెప్పారు.
చిన్నారి anchor చి. మనస్వి శర్మ పిల్లలను ఎవరికైనా ప్రశ్నలు వుంటే అడగమని ఒక్కొక్కరినీ చక్కగా ప్రోత్సహించింది.
ప్రశ్న: పుష్పిక ఎందుకు చదువుతాము?
జవాబు: పూజ అయ్యాక చివరిలో దేవుడికి ఎలాగైతే పువ్వులు అర్పిస్తామో, అలాగే ఈ గీతాధ్యయనం చేస్తున్నామంటే మనకు భగవానులు అర్జునునికి చెప్పిన బ్రహ్మవిద్య, యోగ శాస్త్రము గురించి స్వయంగా చెప్పిన విషయాలను నేర్చుకుంటున్నాము కదా. అందువలన ఆ జ్ఞానమును మనకు భగవానులు ఇస్తున్నందుకు భక్తిగా మనం పుష్పములాగా ఈ పుష్పిక శ్లోకాన్ని భగవానునికి థాంక్స్ గా చెప్పుకుంటున్నాము.
ప్రశ్న: నాకు తొందరగా కోపం వస్తుంది. ఎలాగ కంట్రోల్ చేసుకోవాలి?
జవాబు: నీకు కోపం వస్తోంది అని నీకు తెలిసింది కదా? అది మొదటి స్టెప్. ఇప్పుడు నీకు నువ్వు మరలా మరలా చెప్పుకుని, ప్రాక్టీస్ తో కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకు కోపం వచ్చిందో evaluate చేసుకుని దానిని ఎలాగ తగ్గించుకోవాలో ప్రాక్టీస్ చేసుకోవాలి.
ప్రశ్న: కృష్ణునికి ఎంతమంది అక్క చెల్లెళ్ళు వున్నారు?
జవాబు: కృష్ణునికి ముందు పుట్టిన వారిని కంసుడు సంహరించాడు. తరువాత కృష్ణునికి అన్న బలరాముడు, చెల్లి సుభద్ర.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం(య్ఁ)
యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే శ్రద్ధాత్రయవిభాగయోగో నామ సప్తదశో౽ధ్యాయః
ఈ విధముగా ఓం తత్ సత్ అను భగవన్నామ ఉచ్చారణ పూర్వకమైన బ్రహ్మ విద్య మరియు యోగ శాస్త్ర మయమైన, శ్రీకృష్ణార్జునుల సంభాషణ లేక సంవాద రూపములో ఉన్న శ్రీమద్భగవద్గీతలోని పదిహేడవ అధ్యాయమైన శ్రద్ధాత్రయవిభాగయోగము సమాప్తమైనది